ఇంట్లోనున్న మీ కంప్యూటర్‌ టేబుల్‌ ఎలా ఉందో చూశారా...!

టేబుల్‌ను అందంగా సర్దుకోవాలంటూనే ఉంటారు. కాని సమయం లేదని చాలా మంది నిర్లక్ష్యం చేసేస్తారు. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బల్ల ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

మీ రోజువారీ కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన పనులు, సంప్రదించాల్సిన వ్యక్తులు ఇలా ఎన్నో వివరాలను మనం డైరీలో రాసుకుంటుంటాం. అలాగే ఓ డిస్‌ే్ప్ల బోర్డులో మీరేమేం చేయాలో రాసి కంప్యూటర్‌ టేబుల్‌ సమీపంలో తగిలించండి. 
ప్రతి ముఖ్యమైన అంశాన్ని ఒకే రంగుతో దానిపై రాసేకంటే నాలుగైదు రంగుల పెన్నులతో రాస్తే అవి మిమ్మల్ని ఆకర్షిస్తుంటాయి. దీంతో కనీసం ఆదివారం లేదా మీకు వెసలుబాటు కలిగిన సమయంలో నైనా కంప్యూటర్‌ బల్లను శుభ్రపరచుకునేందుకు వీలుకలుగుతుంది. పనిచేసుకునేందుకు అనువు గానూ ఉంటుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top