గర్భిణుల్లో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎవరిలో ఎక్కువ?

30 ఏళ్లు పైబడిన వారిలో అధిక బరువు ఉన్నవారిలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారిలో ముందు కాన్పులో బిడ్డ కడుపులో చనిపోవడం లేదా పుట్టాక చనిపోవడం, బిడ్డ సైజు పెద్దగా ఉండటం వంటివి జరిగితే, ముందు పుట్టిన బిడ్డకు అంగవైకల్యాలు ఉండటం జరిగితే... ఇలాంటి వాళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశాలెక్కువ.

వ్యాధి నిర్ధారణ : 

పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నవారు మొదటిసారి చెకప్‌కు వచ్చినప్పుడే డాక్టర్‌కు ఈ విషయాలు చెప్పి రక్తంలో చక్కెరపాళ్ల పరీక్ష చేయించుకోవాలి. తర్వాత ఆరో నెలలో షుగర్ పరీక్ష చేయించుకోవాలి. మొదట రాండమ్ బ్లడ్ షుగర్ చేయించుకుని, అది 150 ఎంజీ కంటే ఎక్కువ ఉన్నా లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 110 కంటే ఎక్కువగా ఉన్నా లేదా తిన్న రెండు గంటల తర్వాత షుగర్ 140 కంటే ఎక్కువగా ఉన్నా, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నా గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేయించాలి. తినడంతో సంబంధం లేకుండా 50 గ్రా. గ్లూకోజ్ తాగిస్తారు. గంట తర్వాత రక్తంలో షుగర్ పాళ్లు ఎంత ఉన్నాయో పరీక్షిస్తారు. 

ఒకవేళ ఇది 140 మి.గ్రా. కంటే ఎక్కువగా ఉంటే వారిలో డయాబెటిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం. వ్యాధి నిర్ధారణకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) చేయించాలి. ఇందులో ఏమీ తినకుండా 100 గ్రా. గ్లూకోజ్ తాగించి, గంట, రెండు గంటలు, మూడు గంటల తర్వాత... ఇలా నాలుగుసార్లు రక్తపరీక్ష చేస్తారు. ఈ కొలతలు 95, 180, 155, 140 కంటే ఎక్కువగా ఉంటే షుగర్ ఉన్నట్లు నిర్ధారణ చేస్తారు.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top