బాత్‌రూమ్‌ ఆహ్లాదంగా కనిపించాలంటే..!

స్నానాల గదిలో ఉండేది తక్కువ స్థలమే అయినా పొందిగ్గా అలంకరిస్తేనే అందంగా ఉంటాయి. కృత్రిమంగా చేసిన అరలు ఏర్పాటు చేసుకోవడం, తాజా గాలి లోపలికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడితే చిందరవందరగా లేకుండా ఉంటుంది.

  • స్నానాల గదిలో సబ్బులు, లోషన్లు, మాయిశ్చరెైజన్‌ క్రీములు, షాంపూ డబ్బాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటన్నింటినీ పెట్టడానికి లోపల స్థలం లేనప్పుడు గది బయటపెట్టి ప్రతీసారీ తీసుకెళ్లాలంటే ఇబ్బందే కధా. అందుకే లోపలే వీటిని పెట్టేంత స్థలం లేనపుడు వీలును బట్టి హ్యాంగింగ్‌ అల్మారాలను ఏర్పాటు చేయాలి.
  • వెంటిలేటరుకు దగ్గర్లో బయటవెైపు వీలును బట్టి పచ్చని మొక్కలు నాటడం, కుండీలు ఏర్పాటు చేయడం వంటివి చేయాలి. అప్పుడే తాజా గాలి, పూల సువాసనలు లోపలికి వస్తాయి. స్నానాలగది తలుపుల వద్ద ఉన్న కాళ్లు తుడుచుకొనే పట్టాలను ఎప్పటికప్పుడూ శుభ్రపరిచి ఎండలో ఆరేయాలి.
  • తువాళ్లు, టిష్యూకాగితాలు, హెయిర్‌ డ్రయ్యరు ఒక చోట ఏర్పాటు చేయాలి. అలానే మిగతా క్రీములు, లోషన్లు వేరొక చోట పెట్టాలి. సింక్‌ పెద్దగా ఉంటే కింద స్థలం వృధా అవుతుంది. అలాకాకుండా కింది భాగంలో చెక్కతో అల్మరా ఏర్పాటు చేయించుకోవాలి. అందులో అరలు పెట్టించుకొని, సామగ్రిని పద్ధతి ప్రకారం సర్దుకొంటే అందంగా ఉంటుంది.
  • వీలెైతే షూస్టాండ్‌ను మేకుల ఆధారంతో గోడకు తగిలించవచ్చు. ఈ అరల్లో కూడా సబ్బులు, క్రీములు వేటికవి విడిగా పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు వెతుక్కోకుండా సులువుగా దొరుకుతాయి. నీళ్లు తగిలినా పాడవకుండా రంగులు వేయాలి. అప్పుడే కలప పాడెైపోకుండా ఉంటుంది. కావాలంటే గాజు అరలను కూడా వాడుకోవచ్చు.
  • ప్రత్యేకంగా స్నానాల గదిలో కొవ్వొత్తులు, రూమ్‌ఫషనర్లు పెట్టుకోవడానికి కొంత స్థలం తప్పనిసరిగ్గా ఉండాలి. గది ఆహ్లాదంగా కనిపించడానికి అలంకరణ వస్తువులు, వాల్‌ పెయింటింగ్స్‌ వంటివి పెట్టొచ్చు. గోడకు అందుబాటులో ఉండేలా అద్ధం, తలుపు వెనక భాగంలో చెత్త డబ్బానూ వెలాడదీసుకోవచ్చు.
  • పచ్చటి మొక్క అందించే తాజాగాలికి శరీరంలోని ప్రతికూల ఆలోచనలను దూరం చేసే శక్తి ఉంటుంది. అందుకే అరలో పూల కుండీని ఏర్పాటు చేయడం ఉత్తమం. ఒకవేళ దాన్ని పె ట్టడానికి స్థలం లేకపోతే హ్యాంగింగ్‌ పాట్‌ను తలకు తగలకుండా, వేలాడదీయాలి, అదీ వీలుకాని పక్షంలో గాజు పాత్రలో నీళ్లు పోసి సువాసన వచ్చే పూరేకులను వేయచ్చు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top