తులసి గురించి మీకోసం...

ఎన్నో ఏళ్ల తరబడి హిందువులు భగవంతుడికి కానుకలు, పువ్వులు సమర్పించడం ద్వారా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఎంతో పవిత్రతను, ప్రాధా న్యతను సంతరించుకున్న తులసి నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు దీనిలో ఉన్న ఔషధ గుణాలను సౌందర్య పోషణకు వాడుకుంటున్నారు. ఎందుకంటే తులసి కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలే కాదు మొక్క కింద ఉండే మట్టి కూడా ఎంతో పవిత్ర మైనదని, ఔషధాలతో కూడుకున్నదని పద్మ పురాణంలో పేర్కొ న్నారు. ‘‘తులసి మొక్కను చూసినా లేదా తాకినా అన్ని రకాల ఒత్తిడులు, జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తులసి మొక్కపై నీళ్ళు పోస్తే భయాలన్నీ తొలగిపోతాయి. ఎవరైనా తులసి మొక్కను నాటినా, నీళ్లు పోసినా వారు కృష్ణుడికి ప్రీతి పాత్రమవుతారని’’ స్కందపురాణం చెబుతోంది. అయితే కేవలం దైవాత్వా నికే కాకుండా తులసిలో కొన్ని రకాల ఔషధ గుణాలున్నాయని వైద్య నిపుణులు చెబతున్నారు.

తులసితో...
  • ఔషధ విలువలు సమృద్ధిగా ఉన్న తులసి వల్ల లాభా లెన్కో ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది.
  • కాచిచలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని అంటారు.
  • అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో నులిపురుగులు నశిస్తాయి.
  • జలుబు చేసినప్పుడు తేనెలో ఒక టేబుల్‌ స్పూన్‌ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం లభిస్తుంది.
  • బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయి.
    • ఆకులు
      • జ్వరాన్ని తగ్గిస్తుంది.
      • అల్సర్‌ల నుంచి రక్షిస్తుంది.
      • రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా నియంత్రిస్తుంది.
      • కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి 
      • దోహద పడుతుంది.
      • నోటినుంచి దుర్వాసన వెలువడకుండా నిషేధిస్తుంది.
      • అలర్జీలనుంచి ఉపశమనం కలిగిస్తుంది.
      • ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము నుంచి 
      • శరీరానికి కలిగే హానిని అరికడుతుంది.
      • ఒత్తిడిని దూరం చేస్తుంది.
    • దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రధాన ద్వారానికి ఎదురుగా లేదా పెరట్లో తులసి మొక్క ఉంటుంది. ఎందు కంటే తులసి ఆకుల నుంచి వచ్చే సువాసన ఇల్లంతా పరుచుకొని మంచి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తూ వ్యాధులు రాకుండా చేస్తుందని విశ్వసిస్తారు. తులసి ఆకులను చప్పరించడం వల్ల దానిలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. తులసి ఆకులో ఉండే రసం ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అందుకే చాలా దేవాలయాలలో తీర్ధంలో తులిసీ దళాలను వేసిస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top