మీ డైనింగ్‌ టేబుల్‌ ఎప్పుడూ కొత్తగా ఉండాలనుకుంటున్నారా? అయితే కింది జాగ్రత్తలు పాటించండి.

 డైనింగ్‌ టేబుల్‌ మీద స్టాండ్‌ లేకుండా, వేడి పదార్థాలను వుంచిన గిన్నెలను పెట్టకూడదు. 
* డైనింగ్‌ ప్లేట్లను టేబుల్‌ మీద పెట్టేటప్పుడు, తప్పని సరిగా మేట్స్‌ను ప్లేట్‌ అడుగున ఉంచాలి 
* భోజనానికి ముందు టేబుల్‌ మీద దుమ్ములేకుండా మెత్తటి బట్టతో శుభ్రంగా తుడిచి ఆహార పదార్థాలను, ప్లేట్లను, గ్లాసులను అమర్చాలి. 
* భోజనమైన వెంటనే టేబుల్‌ మీద ఉన్న ప్లేట్లను, గిన్నెలను, గ్లాసులని తీసేసి టేబుల్‌ని శుభ్రం చేసేయాలి. 

* స్పాంజ్‌ కానీ, మెత్తటి బట్టను కాని సర్ఫ్‌ నీళ్ళల్లో తడిపి దానితో టేబుల్‌ను తుడిస్తే టేబుల్‌ మీద జిడ్డు లేకుండా శుభ్రంగా ఉంటుంది. 
* కరెంట్‌ పోయిన సమయంలో కొవ్వొత్తి వెలిగించి భోజనం చేస్తున్నప్పుడు ఆ కొవ్వొత్తిని స్టాండ్‌ లేకుండా టేబుల్‌ మీద పెట్టకూడదు. 
* డైనింగ్‌ టేబుల్‌ మీద ఉపయోగించే స్టాండ్స్‌, మేట్స్‌ టేబుల్‌ మీదనే ఉంచేయకూడదు. వాటిని వేరు చోట భద్రంగా పెట్టాలి. డైనింగ్‌ టేబుల్‌ మీద చక్కగా అందమైన ఫ్లవర్‌ వాజ్‌ను వుంచితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top