మలబద్దకం తగ్గడం ఎలాగో....

ఆహారం: తేలికగా జీర్ణమయ్యేవి, పీచుపదార్థాలెక్కువగా ఉండే శాకాహారం తింటే జీర్ణకోశానికి సంబంధించిన చాలా వ్యాధులు దరిచేరవు. ఒకవేళ మీరు మిశ్రమాహారులైతే మాంసాహారాన్ని బాగా తగ్గించి నెలకు రెండుసార్లు తీసుకోండి. రోజుకి కనీసం నాలుగులీటర్ల నీళ్లు తాగండి.

విహారం: వయసురీత్యా మీ వెసులుబాటుకి అనుగుణంగా తేలికపాటి వ్యాయామం చేయండి. నడక, యోగాసనాల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రాణాయామం కూడా చాలా మంచిది.

ఔషధం: త్రిఫలాచూర్ణం... కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ... ఈ మూడూ ఎండినవి గ్రహించి, పెపైచ్చులను వేరు చేసి, సమాన ప్రమాణంలో (బరువు ప్రకారం) కలుపుకొని చూర్ణం చేసుకోండి. రోజూ రాత్రి పడుకునేటప్పుడు 5 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి సేవించండి. రోజువారీ విరేచనం అవుతుంది. ఇది ఆయుర్వేదంలో పేర్కొన్న ఉత్తమరసాయనం. గుండెకు, నరాలకు, కంటికి, మెదడుకు బలాన్ని ఆరోగ్యాన్ని కలిగించి వాటికి సంబంధించిన వ్యాధుల్ని నివారిస్తుంది. వయసు పైబడినవారు జీవితాంతం వాడదగిన ఔషధం. దీనివల్ల అంతా మంచే. త్రిఫలాచూర్ణాన్ని కషాయంగా కాచుకునీ తాగవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top