అందమైన చెక్కిళ్ళకోసం...

అందమైన చెక్కిళ్ళ కోసం వీలెైనన్నిసార్లు నోటినిండూ గాలిని తీసుకుని బుగ్గల్ని ఉబ్బించండి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లో అందం పరవళ్ళు తొక్కే చెక్కిళ్ళు మీ సొంతం. ప్రతిరోజూ స్నానం చేయడానికి ముందు నూనెత చెంపలను మర్దన చేస్తుంటే త్వరలోనే చెక్కిళ్ళు మౄఎదువుగా మారతాయి. ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలిపోయినట్లుగా అయితే పులిసిన పెరుగు మీద ఉండే మీగడను రాస్తే కొంత ఫలితం ఉంటుంది.చెంపలపెై వున్న మొటిమలను గిల్లడం వలన ఏర్పడిన నల్లని మచ్చలు పోవడానికి బచ్చలి ఆకులు, గులాబీ రేకులు పేస్టుగా చేసి చెక్కిళ్ళకు పూసి కాసేపటి తర్వాత చల్లటినీటితో కడగాలి. కొద్దిరోజులు ఇలా చెయ్యటం వలన ఫలితం ఉంటుంది. ముఖంపెై చర్మం మౄఎదువుగా మెరుపులీనుతూ వుండేందుకు వారానికి ఒక్కసారెైనా నూనె గానీ, నిమ్మరసం, పెరుగు, పెసర పిండి కలిపిన మిశ్రమంతో మసాజ్‌ చేసి స్నానం చేయాలి.



  • పళ్ళు, పచ్చని కూరగాయలు, ఇతర న్యూట్రిషియస్‌ పదార్థాలే కాకుండా ప్రతిరోజూ సుమారుగా ఎనిమిది గ్లాసుల మంచినీరు, మరొక గ్లాస్‌ ఫ్రూట్‌జ్యూస్‌ తాగితే కండరాలు మౄఎదుత్వాన్ని, తగినంత బిగుతును కలిగివుంటాయి. 
  • ముఖం ఆయిల్‌గా ఉండి, చిరాకు పుట్టిస్తుంటే బంగాళాదంపలు గుండ్రని ముక్కలుగా తరిగి ఆ ముక్కలతో చెక్కిళ్ళు రుద్ది, పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకంటే ఆ ముఖం ఫ్రెష్‌గా వుంటుంది. చెంపలపెై అరచెయ్యి ఆన్చి కూర్చోకూడదు. ఇలా చెంపకు చెయ్యి చేర్చడం వలన చెక్కిలి అందాలు చెదిరిపోతాయి. 
  • వక్క, సోపు, టాఫీ నోట్లో వేసుకున్నప్పుడు ఎప్పుడూ ఒకేవెైపు పెట్టుకోరాదు. కోపంగా, బిగ్గరగా అరవటం మంచిదికాదు. పౌడర్‌, లిప్‌స్టిక్‌కి అనుగుణంగానే బ్లషర్‌ చేయించుకోవాలి. అన్నిటికి మించి ఆనందమే బుగ్గల అందం.. అందుచేత ఎప్పుడూ ప్రసన్నంగా, నవ్వుముఖంతో ఉండాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top