మీ ఇంట్లోని కంప్యూటర్ సురక్షితంగా, మెరుగ్గా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు

మీ ఇంట్లోని కంప్యూటర్ సురక్షితంగా, మెరుగ్గా పనిచేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొత్తగా కంప్యూటర్ కొని, దాన్ని ఏర్పాటు చేసుకునే ముందు మీ ఇంట్లోని విద్యుత్తు సరఫరా వ్యవస్థకు ఎర్తింగ్ తప్పనిసరిగా చేయించాలి. ఎర్తింగ్ చేయించకుంటే మీ కంప్యూటర్‌కి విద్యుత్తు సరఫరా అయి షాక్ కొట్టే ప్రమాదముంది. దీనికితోడు ఎర్తింగ్ లేని విద్యుత్తుతో కంప్యూటర్‌ను ఉపయోగిస్తే దానిలోని మదర్‌బోర్డు, హార్డ్ సర్క్యూట్‌లు దెబ్బతినే అవకాశముంది. మీ కంప్యూటర్‌కు నేరుగా ఇంట్లోని విద్యుత్తు బోర్డు నుంచి విద్యుత్తును సరఫరా ఇవ్వకుండా దీనికోసం ప్రత్యేకంగా పవర్ ఎక్స్‌టెన్షన్ బాక్సును ఏర్పాటు చేసుకోవటం మేలు. దీనివల్ల ఏవైనా విద్యుత్తు సమస్యలు ఏర్పడితే ఇంట్లోని విద్యుత్తు బోర్డులపై ఆ ప్రభావం పడదు.

యూపీఎస్ ఏర్పాటు తప్పనిసరి : మీ ఇంట్లో కంప్యూటర్‌కు అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లయి (యూపీఎస్) ఏర్పాటు తప్పనిసరి. తరచూ విద్యుత్తు సరఫరాల్లో అంతరాయాలు వాటిల్లుతున్న నేపథ్యంలో వోల్టేజ్ హెచ్చుతగ్గులను యూపీఎస్ నియంత్రిస్తుంది. యూపీఎస్ లేకుంటే కంప్యూటర్ ఆన్ ఉన్నపుడు విద్యుత్తు పోగానే కంప్యూటర్‌లోని పవర్‌సప్లయి, మదర్‌బోర్డు, హార్డ్‌డిస్క్, హార్డ్ డ్రైవ్‌లు దెబ్బతినే ప్రమాదముంది. కంప్యూటర్ షట్‌డౌన్ చేయకపోవటం వల్ల ఇందులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అయ్యే అవకాశముంది. మీ కంప్యూటర్‌లో స్టోర్ చేసిన డాటా పోయే అవకాశం కూడా ఉంది. అందువల్లనే కంప్యూటర్‌కు యూపీఎస్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవటం మేలు.


మీ కంప్యూటర్‌ను దుమ్ము, ధూళిల నుంచి సంరక్షించుకోండి. మీ సిస్టమ్ సీపీయూలో ప్రాసెసర్, మెమొరి ర్యామ్‌లకు దుమ్ము పడితే కంప్యూటర్ స్టార్ట్ కాదు. బీప్ సౌండ్ రావటం, హ్యాంగ్ అవటం జరుగుతుంటుంది. అలాంటపుడు మీ సిస్టమ్‌ను లోపల తెరవకుండా బయట దుమ్ము పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.

- కంప్యూటర్‌తోపాటు మీ కీబోర్డుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నీటి తడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

- మీ కంప్యూటర్ సెక్యూరిటీ కోసం సరైన యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం మంచిది.

- మీ కంప్యూటర్‌ను తరచూ ఫార్మాట్ చేస్తుంటే హార్డ్ డిస్క్‌లో మీడియా ఎర్రర్ వస్తుంది.

- పెన్‌డ్రైవ్‌లు మీ సిస్టమ్‌కు పెట్టి సమాచారాన్ని కాపీ చేసుకోవాలన్నా, పెన్‌డ్రైవ్‌లోని డాటాను కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా ముందుగా దాన్ని డ్రైవ్‌లో పెట్టి స్కాన్ చేయండి. పెన్‌డ్రైవ్‌ల ద్వారా మీ సిస్టమ్‌లోకి వైరస్ రావటం వల్ల మీ కంప్యూటర్‌లోని కొన్ని ఫైళ్లు, డాటా మిస్ అయ్యే అవకాశముంది.

- పాత సీడీల్లో వైరస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మీ కంప్యూటర్‌లో పాత సీడీలు పెట్టకండి. పాత సీడీలు వినియోగిస్తే కంప్యూటర్ హ్యాంగ్ అయ్యే ప్రమాదం ఉంది.


- కంప్యూటర్‌లో ఎక్కువ డాటా, ఫోటోలు, ఫైళ్లు, డాక్యుమెంట్లు, మ్యూజిక్ ఫైళ్లు పెట్టకండి. దీనివల్ల మీ సిస్టమ్ స్లో అయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మీ డెస్క్‌టాప్‌తోపాటు మీ డ్రైవ్‌లలో అనవసరపు సమాచారాన్ని తొలగించటం మేలు.

- మీ కంప్యూటర్‌లో ఇంటర్నల్ హార్డ్ డిస్క్ సామర్ధ్యం కంటే అధికంగా డాటా ఉంచాలంటే, హార్డ్ డిస్క్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. 40, 80,160, 250,500,1000జీబీల్లో హార్డ్‌డిస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు మరింత డాటాను మీ వద్ద దాచుకోవాలంటే కంప్యూటర్‌లో కాకుండా అదనపు ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్ పెట్టుకొని, దానిలోకి డాటాను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీ సిస్టమ్‌లో ఎక్కువ డాటా ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీ కంప్యూటర్ మెరుగ్గా పనిచేస్తుందని గుర్తించండి.

- మీ కంప్యూటర్ ఆన్ చేయగానే ఒపెన్ కాకుంటే, మీకు దీనిపై బేసిక్ నాలెడ్జ్ ఉంటే చూడండి. లేకుంటే సీపీయూ తెరవకుండానే మీ దగ్గరలోని కంప్యూటర్ సర్వీస్ సెంటరుకు తీసుకురండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top