సైక్లింగ్ ఎక్సర్‌సైజ్ వల్ల లేదా సైకిల్ తొక్కడం వల్ల మోకాళ్లు మరింత దెబ్బతింటాయని చాలా మందిలో ఒక అపోహ ఉంది. నిజానికి మోకాళ్ల నొప్పుల నివారణకు సైక్లింగ్ చాలా మంచిది. మామూలుగా నడిచే సైకిల్ తొక్కినా, లేక ఒకే చోట స్థిరంగా ఉండే ఎక్సర్‌సైజ్ సైకిల్ తొక్కినా మీ బరువు మీ శరీరంపై పడదు. కాబట్టిమోకాళ్లపై శరీరం బరువు చాలామట్టుకు తగ్గిపోతుంది. సైక్లింగ్‌లో పెడల్ తొక్కడం వల్ల మోకాళ్లు బాగా కదిలి మంచి ఎక్సర్‌సైజ్ అవుతుంది. అయితే సైక్లింగ్ వల్ల మోకాళ్లు మరింతగా దెబ్బతింటాయేమోననే అనుమానంతో వ్యాయామం చేస్తే... అది మీకు తగినంత సంతృప్తి ఇవ్వకపోవచ్చు. అందుకే ఈత ట్రై చేయండి. సైక్లింగ్‌లో లాగానే ఈత (స్విమ్మింగ్)లో కూడా శరీరం బరువు మోకాళ్లపై ఏమాత్రం పడదు కాబట్టి మోకాళ్ల ఆరోగ్యానికి అది కూడా ఓ మంచి వ్యాయామమే.
సైక్లింగ్‌తో మోకాళ్ల నొప్పులు త గ్గుతాయా?
teluguLifestyle Editor
11:44:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.