ఫిక్స్‌డ్ డిపాజిట్లు : జాగ్రత్తలు

బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లంటే.. ‘ఆ రూపాయి కూడా వడ్డీరాదు అదెందుకు’ అనే వారు ఎంతమంది ఉన్నారో ‘మన డబ్బుకు ఢోకా ఉండదు’ అనుకునే వారు అంతకంటే ఎక్కువమంది ఉన్నారు. అలా ‘అసలు భద్రం-అధిక లాభం’ అనుకునేవారికి కొన్ని జాగ్రత్తలు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. అంటే ఏదైనా బ్యాంకులో డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే దానిపై ఏడాదిలోపు వచ్చే వడ్డీ పదివేలు దాటితే 10.3 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. మీ డబ్బు ఆదాయం లేని మీ పిల్లల పేర్లు మీదనో, మీ భార్య పేరు మీదనో డిపాజిట్ చేసినా కూడా ఆ వడ్డీ మీ ఆదాయంగానే పరిగణించి పన్ను వేస్తారు. అయితే, మీ ఆదాయ మార్గాలన్నీ చూపి, పాన్ కార్డు ఇస్తే వడ్డీ కలిపినా మీ ఆదాయం రూ.2 లక్షలు మించకపోతే పన్నువేయరు. ఇప్పటికే మీ ఆదాయం రెండు లక్షలు దాటి ఉంటే పన్ను భారం తగ్గించుకోవడానికి వేర్వేరు బ్యాంకుల్లో వేర్వేరు మొత్తాల్లో పొదుపు చేయాలి. వడ్డీ పదివేలకు మించకుండా విభజించి చిన్నమొత్తాలుగా పొదుపు చేయాల్సి ఉంటుంది. 

లక్ష కంటే ఎక్కువ పొదుపు చేస్తుంటే మొత్తం సొమ్మును ఒకే కాలానికి పొదుపు చేయడం కూడా మంచిది కాదు. ఉదా: మీ దగ్గర నాలుగు లక్షలు ఉంటే ఏడాది కాలపరిమితికి లక్ష రూపాయలు, రెండేళ్ల కాలానికి మరో లక్ష రూపాయలు, మూడేళ్ల కాలానికి ఒక లక్ష, నాలుగేళ్లకో లక్ష పొదుపు చేయాలి. దీనివల్ల రెండు లాభాలున్నాయి. ఒకటి: ప్రతి ఏటా డబ్బు అందుబాటులోకి వచ్చి అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి కాలపరిమితికి ముందే తీసుకుంటే వేసే జరిమానా భరించాల్సిన అవసరం ఉండదు. రెండో ప్రయోజనం: ఎప్పటికప్పుడు మారే బ్యాంకు వడ్డీ రేట్ల వల్ల నష్టపోకుండా ఉంటారు. మీరు డిపాజిట్ చేసినపుడు వడ్డీ రేటు 8.5 శాతం ఉండి, తర్వాత ఒక నెలకే 9 శాతం అయినా మీకొచ్చేది 8.5 శాతమే. కాబట్టి కాలానుగుణంగా మారే వడ్డీ రేట్ల నుంచి లాభం పొందాలంటే వేర్వేరు కాలపరిమితులకు డిపాజిట్ చేయడం మంచిది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top