సౌందర్య సాధనంగా కోడిగుడ్డు!

కోడిగుడ్డును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యమే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయో గించుకోవచ్చు. గుడ్డులోని పచ్చసొన రెండు స్పూన్లు, ఫ్రెష్‌ గులాబీ పువ్వుల రసం రెండు స్పూన్లు.. ఈ రెండిం టిని బాగా కలిపి ముఖానికి రాసుకుంటే.. ముఖం ఎంతో సౌందర్యంగా, మౄఎదువుగా ఉంటుంది. మొటిమలు రావని బ్యూటీషన్లు చెబుతున్నారు. మొటిమలున్నవారు వెల్లుల్లి రేకులు మూడు నూరి దాన్ని గుడ్డు తెల్లసొనతో కలిపి, ఆ మిశ్రమానికి ఒక స్పూన్‌ కాలమైన్‌ చేర్చి, ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కుడుక్కోవాలి. ఇది మొటిమల్ని బాగా తగ్గిస్తుంది. కోడిగుడ్డులోని పచ్చసొన, రెండు స్పూన్ల బాదంనూనె, వెన్నతీసిన పాలు, కొంచెం కర్పూరం కలిపి చర్మానికి రాసుకుంటూ వుంటే చర్మం కాంతివంతంగా, మౄఎదు వుగా ఉంటుంది. అలాగే కోడిగుడ్డులోని తెల్లసొన ఒక స్పూన్‌, పాలమీగడ ఒక స్పూన్‌, నిమ్మరసం ఐదు చుక్కలు ఈ మూడింటిని బాగా కలిపి, రోజూ రాతప్రూట పడుకునే ముందు రాసుకుని మసాజ్‌ చేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top