మోకాలి నొప్పులు ఆహారంలో మార్పు తో తగ్గించుకోవచ్చు

అర్థరెైటిస్‌ జటిలమైన సమస్య కానే కాదు. ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయిం చుకుంటే నయమవుతుంది. మోకాలి నొప్పులు కేవలం పెద్ద వయసులో ఉన్న వారికి మాత్రమే వస్తాయని అనుకోకూడదు. నొప్పి మొదలెైనప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో మార్పు తో కూడా కొంత వరకు నయం చేసుకోవచ్చు.

నిజానికి మోకాలి నొప్పులు సర్వసాధారణం. 50 ఏళ్ళు పెైబడిన వారికి మోకాలి నొప్పులు సహజం. ఈ నొప్పుల కారణంగా రోజువారీ పనులు చేసుకోలేకపోతారు. సగటున ఇంటికొకరు ఈ వ్యాధితో బాధపడుతు న్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. మోకాళ్లే కాదు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారూ చాలా మంది ఉన్నారు .సాధారణంగా 50 ఏళ్ల వయసుపెైబడిన వారికి మోకాలి నొప్పులు వస్తాయి. అంతమాత్రాన చిన్న వయసు వారికి మాత్రం రావని అనుకోకూడదు. ఇది ఏ వయసు వారికైనా, ఎవరికైనా రావచ్చు. అయితే వ్యాధి లక్షణాలు, తీవ్రత వేర్వేరుగా ఉంటాయి. పెద్ద వయసు వారు సాధారణంగా ‘ఆస్టియో ఆర్థరెైటిస్‌’తో బాధపడుతుంటారు. ఇది తుంటి, మోకాలి ఎముకలపెై ప్రభావం చూపుతుంది.

‘సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మనిషి జీవనశెైలిలో ఎంతో మార్పు వచ్చింది. కంప్యూటర్‌, టీవీ, మొబెైల్‌ మొదలెైనవి మనిషిలోని సహజంగా ఉండే పని సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. స్థూలకాయంతో ‘ఆస్టియో ఆర్థరెైటిస్‌’ రావచ్చు. ఈ రోజుల్లో చిన్న వయసు వాళ్ళు కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నారని వెైద్యులు తెలిపారు.‘రుమటైడ్‌ ఆర్థరెైటిస్‌’ ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. ఇది కీళ్లపెై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి ఉదయం పూట బాధ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మోకాళ్లు, కీళ్ళు బిగుసుకు పోయినట్లు ఉంటాయి.

మోకాలి నొప్పులతో బాధపడే వారిలో 60 శాతం మంది మహిళలేనని తాజా పరిశోధనల్లో వెల్లడెైంది. పోషణ, జీవన విధానం దానికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. వయసు పెరిగే కొద్దీ వాజురి ఒంట్లో కాల్షియం తగ్గిపోతుంది. ఎముకలలో బలం తగ్గి నీరసం వచ్చేస్తుంది. ఆర్థరెైటిస్‌ని పూర్తిగా నయం చెయ్యలే కపోయినా చాలా వరకు నియంత్రించే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని చూకూర్చే సమతుల ఆహారం, వ్యాయా మం, సకాలంలో చికిత్సతో వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. బలవర్ధకమైన పౌష్టికాహారంతో మోకాలి నొప్పులు రాకుండా చూసుకోవచ్చు. దీని కోసం విటమిన్లు, ఖనిజ లవణాలు బాగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

ఊబకాయం రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కీళ్లు, కండరాలపెై ఎక్కువ ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహించాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. వెైద్యపరంగా నొప్పి నివారణకు అవసరమైన మందులు వాడాలి. అయితే వీటితో ఆశించిన ఫలితం కనిపించకపోతే సర్జరీ మరో ప్రత్యామ్నాయం. దీనికి సంబంధించి ఎన్నో ఆధునిక పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటితో సర్జరీ చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. మోకాలి నొప్పులను అశ్రద్ధ చేసినా, తాత్సారం చేసినా తుంటి లేదా మోకాలి మార్పిడి తప్పనిసరి అవుతుంది.
కాబట్టి ఆర్థరెైటిస్‌ సమస్యను ఆదిలోనే గుర్తించి తగిన చికిత్స చేయించుకోవడం శ్రేయస్కరం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top