పండుగలు, పర్వదినాలతోపాడు వేడుకల సమయంలో కూడా ఇంటి ముఖద్వారానికి తాజా మామిడి ఆకుల తోరణాన్ని కడతారు. ఇది ఎందుకంటే... మామిడి ఆకులు నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయని, ఇంటికి శుభాన్ని కలిగిస్తాయని విశ్వాసం. అప్పుడే చెట్టు నుంచి కోసిన తాజా ఆకుల నుంచి వెలువడే పరిమళం, పచ్చదనం, ఆక్సిజన్ పరిసరాలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన, సాత్వికమైన, శుభప్రదమైన ఆలోచనలను కలిగిస్తాయి. పైగా పదిమంది కలిసిన చోట తగినంత ఆక్సిజన్ అందని పరిస్థితిని అధిగమించడానికి తోడ్పడతాయి. అందుకే ఏ శుభకార్యం జరుగుతున్నా మామిడి తోరణాలను కట్టడం ఆనవాయితీగా మారింది. కంటికి హాయినిచ్చే పచ్చదనం క్రమంగా స్వాగత చిహ్నంగా స్థిరపడింది.
గుమ్మానికి మామిడి తోరణాలు కడతారెందుకు?
teluguLifestyle Editor
11:17:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.