హైహీల్‌తో వచ్చే దుష్పరిణామాలు తెలిసినప్పటికీ వాటిపై మోజు తీరడం లేదా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి.

షాపింగ్ చేసేటట్లయితే మధ్యాహ్నం లేదా సాయంత్రాలే చేయండి. ఆ సమయంలో మీ పాదల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. మిగతా సమయాల్లో హైహీల్స్ ధరించాల్సి వస్తే ఆ సమయాల్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ కావడంతో పాదాలు ఎక్కువ పీడనకు గురవుతాయి. 


మీ హైహీల్ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా... రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. (ఒక్కోసారి హీల్ నిడివిలోనూ మార్పు ఉండవచ్చు. రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఆ తేడా తెలిసేందుకు అవకాశం ఎక్కువ). 


పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే పాదరక్షలూ వద్దు. తక్కువ హీల్ ఉండే పాదరక్షలే మేలు. 


మీ మడమ వెడల్పు ఎంతో చూడండి. మీ మడమ ఎత్తు అందులో సగం ఉంటే అది సరైన ఆరోగ్యకరమైన హీల్ అని గుర్తుంచుకోండి. మరీ కావాలంటే మీ మడమ వెడల్పుతో పోలిస్తే మీ హీల్ ఎత్తు మూడొంతులకు మించనివ్వవద్దు. 


పాయింటెడ్ హైహీల్స్ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్ వేసుకోవద్దు. 


షిన్ స్ల్పింట్ అనే టిబియా ఎముక గాయపడే పరిస్థితిని నివారించడానికి మీరు హైహీల్స్ తొడగడం ప్రాక్టీస్‌చేసే సమయంలో కొద్దికొద్దిగా హీల్‌ను పెంచుకోండి. ఒకేసారి ఎక్కువ ఎత్తుండే హైహీల్స్ వద్దు. 


హైహీల్స్ వేసుకునే ముందుగా మీ కాఫ్ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ వార్మప్ మసాజ్ చేయండి. కాఫ్ మజిల్స్‌కు ప్రతిరోజూ తగినంత వ్యాయామాన్ని, స్ట్రెచింగ్‌ను ఇవ్వండి. 


మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్ వేసుకుంటే... అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలాగే నిలబడండి.


హైహీల్స్ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top