చెట్టుకొట్టి... గోడ కట్టకూడదంటారు ఎందుకు?

ఇల్లు కట్టాలన్నా, ఇంటి ముందు ప్రహరీ నిర్మించాలన్నా ఆ ప్రదేశంలో చెట్టు ఉంటే ఏం చేస్తాం, వెంటనే దాన్ని నరికేసి నేలను చదును చేసి నిర్మాణపనులు మొదలు పెడతాం. అయితే వేదకాలం నుంచి మన సంప్రదాయంలో చెట్టును ప్రకృతి దేవతగా పూజించేవాళ్లు. చెట్టును కొట్టేయడం అంటే ప్రకృతి దేవత మీద దాడి చేయడమేననే అభిప్రాయం కూడా బలంగా ఉండేది. అందుకే చెట్టును కొట్టి గోడ కట్టడం తప్పు, అరిష్టం అనేవారు. చెట్టును అలాగే ఉంచి మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని సూచించేవారు. విచక్షణరహితంగా నిర్మాణాలు చేపట్టకుండా ప్రకృతిని పరిరక్షించుకుంటూ నివాసభవనాలను నిర్మించుకోవాలని చెప్పడమే ఇందులో ఉద్దేశం. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top