శరీరంలో చక్కెర శాతం తగ్గిపోయినప్పుడు....

శరీరంలోని చక్కెరను క్రమం తప్పకుండా నియంత్రణలో పెట్టుకోడానికి మనం తిన్నా తినకున్నా మాత్ర వేసుకోవాలనే అభిప్రాయం చాలామంది డయాబెటిస్ రోగుల్లో ఉంటుంది. 


- ఒక్కోసారి ఏమీ తినకుండానే మాత్రలు మాత్రం క్రమం తప్పకుండా వేసుకుంటున్నప్పుడు అదనపు చక్కెర లేకపోవడంతో ఆ మాత్రలు శరీరంలో ఉన్న కొద్దిపాటి శక్తి నిల్వలనూ హరించి వేస్తాయి. 
- దాంతో కీలకమైన జీవక్రియలకు అవసరమైన చక్కెర కూడా లేని పరిస్థితి ఏర్పడి డయాబెటిస్ రోగులు అపస్మారక స్థితిలోకి లేదా ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్లిపోతారు. దీన్ని హైపోగ్లైసీమిక్ ఎపిసోడ్ అని అంటారు. 
- ఇలా అపస్మారక పరిస్థితిలోకి వెళ్లబోతున్నవారికి వెంటనే చాక్లెట్, బిస్కెట్ లేదా ఏదైనా తీపి పదార్థం ఇవ్వాలి. ఈ పరిస్థితిలో వారు చక్కెర రోగులని సందేహించి అలా చేస్తే ఏమవుతుందో అని వెనకాడితే ఒక్కోసారి మొదటికే మోసం రావచ్చు. 
- అందుకే అలాంటి పరిస్థితిని నివారించడానికి చక్కెర రోగికి స్వీట్ పెట్టడమే మంచి ప్రథమ చికిత్స. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top