చెక్కు గురించి...

బ్యాంకు నుంచి చెక్ బుక్ తీసుకునేటపుడు ఎన్ని ఉన్నాయో లెక్క చూసుకోవాలి. ఇది మోసానికి మొదటి నివారణ. చెక్ పోతే దాని ముందూ వెనుకా ఉన్న చెక్‌లను బట్టి పోయిందేదో అర్థం చేసుకోవచ్చు. ఏ చెక్కు ఎవరికి ఇచ్చిందీ నంబరుతో సహా చెక్‌బుక్‌లోనూ, మీ ఫైనాన్షియల్ డైరీలోనూ రాసి పెట్టుకోండి. కొట్టివేతల చెక్కు ఎవరికీ ఇవ్వకండి. దాన్ని చింపేసి మరో కొత్తది మంజూరు చేయండి. చెక్కుపై వివరాలన్నీ రాశాకే సంతకం పెట్టాలి. పేరు ముందు, అంకెల ముందు ఖాళీ స్థలం వదలొద్దు. వీలైనంత వరకు అకౌంట్ పే చెక్కులే ఇవ్వండి. ఎంఐసీఆర్ బాండ్ (చెక్కు కింద నెంబర్లుండే భాగం)పై పిన్, గమ్, సైన్ చేయొద్దు. మడత పడనీయొద్దు. రూపాయలు-పైసల మధ్య ‘.’ (చుక్క) పెట్టకండి. ‘/’ (ఆబ్లిక్) ...ఈ సింబల్ పెడితే స్పష్టత ఉంటుంది.

మీకు రావల్సిన డబ్బుకు ఎవరైనా చెక్కు ఇచ్చారంటే ఇక భయపడక్కర్లేదు. చెక్ బౌన్స్ అయితే సివిల్ వివాదాల కోర్టు ద్వారా చెక్కుపై రాసిచ్చిన సొమ్మును తిరిగి పొందొచ్చు. కోర్టుకా అని భయపడక్కర్లేదు. ఈ కేసులు త్వరగానే తేలతాయి. మీ కోర్టు ఖర్చులు కూడా వసూలవుతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top