ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు...

- ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ను ఎంతగా వాడుకుంటే అంత శ్రమ తగ్గుతుంది. ఎఫ్‌డీ చేయడం, చెక్‌బుక్ కోరడం, మంజూరు చేసిన చెక్‌ను ఆపడం... ఇంకా ఎన్నో పనులు ఒక్క నిమిషంలో చేసుకోవచ్చు.
- ఎక్కువ బ్యాంకులు, ఎక్కువ పాస్‌వర్డ్‌లు ఉంటాయి కాబట్టి తరచూ మరిచిపోతుంటారు. దీనికో సులువైన చిట్కా ఏంటంటే... ప్రతివారం కనీసం ఒకసారైనా లాగిన్ కావడం. 
- రెగ్యులర్ పాస్‌వర్డ్‌లు బాగానే గుర్తుంటాయి కానీ ప్రొఫైల్ పాస్‌వర్డ్‌లు, ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్‌లు అంతగా గుర్తుండవు. అలాంటి వాటిని ఎక్కడైనా రాసిపెట్టి భద్రంగా దాచుకోండి. 
- యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను బ్యాంకు మిమ్మల్ని ఎప్పుడూ అడగదు. అలాంటి ఫోన్లు, మెయిల్స్‌కు స్పందించొద్దు.
- ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిపే వెబ్‌సైట్ అడ్రస్ జ్ట్టిఞట తో మొదలుకావాలి. మామూలు సైట్లు చివర్లో ఉండే ట అక్షరం భద్రతకు (secure)కు సూచిక .
- మీరు లాగిన్ అయ్యాక హోమ్‌పేజీలో లాస్ట్ లాగిన్ డేట్ ఉంటుంది. ప్రతిసారీ దాన్ని గమనిస్తే మీకు తెలియకుండా ఎవరైనా ఓపెన్ చేసినా తెలిసిపోతుంది.
- ఆన్‌లైన్లో విఫలమైన ట్రాన్సాక్షన్లను పరిష్కరించుకోవడానికి బ్యాంకుకే వెళ్లక్కర్లేదు. ఫోన్ బ్యాంకింగ్ ద్వారా, మెయిల్ ద్వారా పరిష్కరించుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top