ప్రొటీన్ పులావ్

కావలసినవి: 
బాస్మతి బియ్యం - 120 గ్రా.
ఎండు బఠాణీ - 20 గ్రా; రాజ్మా - 20 గ్రా.
సోయాబీన్స్ - 20 గ్రా; క్యారట్ తరుగు - 40గ్రా., ఉల్లితరుగు - కప్పు; టొమాటోలు - 3
ఉప్పు - తగినంత; నూనె - 4 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - రెండు రెమ్మలు

పేస్ట్ కోసం: అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - 4; వెల్లుల్లి రేకలు - 6
కొత్తిమీర - చిన్న కట్ట; లవంగాలు - 2
ఏలకులు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క
షాజీరా - టీ స్పూను; పసుపు - కొద్దిగా

తయారి: 
బఠాణీ, రాజ్మా, సోయా గింజలు, బియ్యం... వీటిని విడివిడిగా రెండు గంటలపాటు నానబెట్టి, నీరు ఒంపేయాలి. 
బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. టొమాటో తరుగు, మసాలా పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి. బియ్యం, నానబెట్టుకున్న గింజలు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలపాలి. తగినంత నీరు పోసి ప్రెజర్‌కుకర్‌లో సుమారు పది నిముషాలు ఉడికించి దింపేయాలి. అప్పడం, రైతాలతో సర్వ్ చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top