గర్భవతులలో ఒత్తిడిని తగ్గించుకోవటానికి కొన్ని మార్గాలు

అయిదు నిమిషాలు ప్రశాంతత పొందండి : ప్రతీది సరిగ్గా అమరేలా చేసుకోవడం వల్ల మీకు మీరే సమయం కేటాయించుకోలేనంత బిజీ గా మారతారు. కొత్త జీవితాన్ని ఆస్వాదించడం కోసం అలసట చెందుతారు. అందువల్ల కొంత సమయాన్ని తీసుకొని విశ్రాంతి పొందండి. హాయిగా స్నానం చేస్తే మీ శరీరంతో పాటు మీ మనస్సు ఉత్తేజపడు తుంది. మీకున్న బాధలు, నొప్పులకు ఇది ఉపశమనంగా ఉపయోగపడుతుంది. మీ స్నానపు నీళ్లలో కొన్ని సుగంధ తైలాలను అలాగే లావెండర్‌ వంటివి చేర్చ డం వలన ప్రశాంతత పొందుతారు.


మస్సాజ్‌ చేసుకోండి : ఒత్తిడి నుండి ఉపశమనం కలి గించే శక్తి మస్సాజ్‌కి ఉంది. మస్సాజ్‌ తరువాత శరీరం మనస్సు తేలికపడుతుంది.


తేలికపాటి వ్యాయామాన్ని చెయ్యండి : తేలికపాటి వ్యాయామం చెయ్యడం ఎంతో మేలు. చిన్న నడక, ఈత లేదా యోగా క్లాస్‌ వంటివి మనల్ని తిరిగి ఉత్తేజితుల్ని చెయ్యడంలో ప్రజన పాత్ర పోషిస్తాయి. యోగా క్లాసులలో సాధన చేసే ప్రాణాయామ పద్దతుల వల్ల ఒత్తిడి నుండి కాపాడుకునే అవకాశం ఉంటుంది.


ఆక్యుపంక్చర్‌ : ఆక్యుపంక్చర్‌ అనే చికిత్స కి ఒత్తిడి ని తగ్గించే శక్తి ఉంది. విశ్రాంతి కలిగించే ఎండార్ఫిన్స్‌ ని విడుదల చేయడం ద్వారా శరీరానికి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. తద్వారా, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆక్యుపంక్చరిస్ట్‌ని కలవండి.

శ్వాస పీల్చండి : ఒత్తిడినుండి ఉపశమనం పొందడానికి కొం దరు స్ర్తీలు ధ్యానాన్ని ఎంచుకుంటారు. మనస్సుని నిర్మలంగా చేసుకుని, 15 నిమిషాల పాటు ధ్యానం చేస్తే శారీరక శ్రమ నుండి ఉపశమనం కలుగుతుంది.


మాట్లాడండి : మీ గర్భం గురించి ప్రకటించగానే, మీ గురించి తెలు సుకునేందుకు ఈ ప్రపంచం మొత్తం ఆసక్తి కనబరుస్తుంది. ఈ తొమ్మిది నెలల కాలంలో మీ కుటుంబం అలాగే స్నేహి తులు మీ క్షేమ సమాచారం గురించి వినడానికి ఇష్టపడ తారు. ఒత్తిడికి గురవుతున్న ట్ట యితే వెంటనే మీకు దగ్గరివారితో మాట లు కలపండి. మీ దిగులుని పంచుకోండి. వారు ఇచ్చే ధైర్యంతో ఒత్తిడి నుండి కొంత మేరకు ఉపశమనం పొందుతారు.


పంచుకోవడం అంటే పట్టించుకోవటమే : మీరు చెయ్యవల సిన పనుల జాబితా అలా పెరుగుతూ పోతూ ఉంటే అవి ఎలా పూర్తి చెయ్యాలో అని ఒత్తిడి పెరగడం సహజం.వాటి గురించి బాధ పడకుండా వాటిని మీ శ్రేయాభిలాషులకి అలాగే మీ స్నేహితులకి కొంత పంచడం వలన మీరు సంతోషంగా ఉంటారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top