కార్న్‌ప్లేక్స్‌ లడ్డు

కావలసిన పదార్థాలు
కార్న్‌ ఫ్లేక్స్‌ (మిక్చర్‌ కోసం వాడే మొక్కజొన్న ఫ్లేక్స్‌)
కిలో 
మంచినీళ్లు : తగినన్ని,
రిఫైండ్‌ ఆయిల్‌ : తగినంత,
పంచదారపొడి : కేజీ 200 గ్రా.,
ఛాయ పెసరపప్పు : పావు కేజీ,
నెయ్యి : పావుకేజీ, 
కోవా : 200గ్రా.,
జీడిపప్పు : 50గ్రా.,
కిస్‌మిస్‌ : 25గ్రా.,
యాలకులపొడి : ఒకటిన్నర సూన్‌,
పచ్చకర్పూరం : పావు స్పూన్‌.

తయారు చేసే విధానం
కార్న్‌ఫ్లేక్స్‌ను నూనెలో దోరగా వేయించి చల్లార్చి పక్కన పెట్టి, ఆరిన తరవాత మిక్సీలో మెత్తటి పొడిలాగా గ్రైండ్‌ చేసుకోవాలి. పెసరపప్పును నానబెట్టి, నీళ్లు వార్చేసి... ఆపై నూనెలో వేయించి కార్న్‌ మాదిరిగానే చల్లారిన తరవాత పొడి చేయాలి. మందపాటి పాత్రలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులోనే యాలకులపొడి, పచ్చకర్పూరం, కోవా వేసి బాగా కలపాలి. తరవాత కార్న్‌ఫ్లేక్స్‌, పెసరపప్పు పొడులను కూడా వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉండగానే లడ్డూల్లాగా చేయాలి. వీటి పైన ఓ కిస్‌మిస్‌ను, జీడిపప్పును అద్దితే చూడ్డానికి అందంగా ఉంటాయి. అంతే కార్న్‌ఫ్లేక్స్‌ లడ్డూలు తయారైనట్లే..!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top