నిర్దిష్టమైన సమయానికి మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారా?

నిర్దిష్టమైన సమయానికి మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారా? మధ్యాహ్నం తీసుకునే ఆహారం సమయానికి తీసుకోవాలి. మధ్యాహ్న సమయంలో తీసుకొనే ఆహారం ఉదయపు ఆహారాన్ని బేస్‌ చేసుకొని ఉండాలి. ఉదయమే పూర్తి ఆహారం తీసుకొంటే మధ్యాహ్నం దాని లోటు భర్తీ చేసేట్లు ఉండాలి. 

లేదంటే ఉదయం పూట భర్తీ చేసేట్లు తీసుకొంటే మధ్యాహ్నం పూర్తి స్థాయిలో ఉండాలి. ఆహారంలో కనీసం సగానికి తగ్గకుండా కూరలు లేదా పచ్చికాయల పచ్చళ్లు ఉండాలి. ఆకుకూరల వాడకం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పగటిపూట శరీరం, మనస్సు చాలా చురుగ్గా ఉండాల్సి ఉంటుంది. అందుచేత దీనికి తగినట్లుగా ఆహారాన్ని మలచుకోవాలి.


అంతే గాకుండా ఆహారం తీసుకొనేటప్పుడు జీర్ణప్రక్రియను దౄఎష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కడుపులో సగం దాకా ఘన ఆహారం, పావు భాగం నీరు, పావు భాగం ఖాళీ ఉంటే తేలిగ్గా జీర్ణం అవుతుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో తప్పకుండా పెరుగు ఉండేలా చూసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top