శీతాకాలంలో ముఖాన్ని మెరిపించే ఫేషియల్స్

1. పసుపుతో ఫేషియల్ :
పసుపు పొడి, చందనం, పాలు, బాదం ఆయిల్, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొనను బాగా కలిపి ఈ మిశ్రమంతో ఫేస్‌ ప్యాక్ వేసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ చర్మం మెరిసిపోతుంది. 

2. తేనెతో ఫేషియల్ : 
ఒక స్పూన్ పాలు పౌడర్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం, బాదం నూనెను బాగా పేస్ట్‌లా కలుపుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్‌తో మీ చర్మం మృదువుగా కోమలంగా తయారవుతుంది. 

3. ఓట్స్ ఫేషియల్ :
ఓట్స్, పెరుగు, టమోటా జ్యూస్‌ను బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే మీ చర్మం కాంతివంతమవుతుంది. 

4. బాదం ఫేషియల్ :
బాదం పప్పుల్ని నీటిలో నానబెట్టి మిక్సీలో పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త మినప్పిండి, పాలు, నిమ్మరసం చేర్చి రెండు వారాల పాటు ముఖానికి రాసుకుంటే మీరు బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top