అందమైన పెదాలు సొంతం....కావాలంటే...???

గులాబీరేకల్ని పాలతో మెత్తగా చేసుకొని దానికి ఓ చెంచా గ్లిజరిన్ కలిపి రాత్రి పూట పెదాలకు పూతలా వేసుకోండి.ఉదయాన్నే చన్నీటితో కడిగి బాదం నూనె రాసుకొంటే పెదాలు పొడిబారడం తగ్గుతుంది.

తాజా కొత్తిమీరను మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి .దానికి కొద్దిగా వెన్న ,రెండు చుక్కల నిమ్మరసం కలిపి పెదవులకు రాసి మృదువుగా మర్దన చేయాలి .ఇలా తరచూ చేస్తుంటే పెదాలు మృదువుగా మారతాయి.

వారానికోసారి బీట్ రూట్ గుజ్జులో కొంచెం పాలమీగడ కలిపి రాసుకోవాలి.పదినిమిషాల తరవాత చల్లని నీటితో కడిగేసుకొంటే లేత గులాబీ రంగులో అదరాలు మెరిసిపోవడం ఖాయం .

నిమ్మరసంలో కొద్దిగా తేనె , గ్లిజరిన్ కలుపుకొని రోజూరాత్రి పూట రాసుకొంటే క్రమంగా నలుపు తగ్గుతుంది .

తరచూ పెదాలు పొడిబారి పగులుతూ ఉంటే టమాటా రసంలో రెండు చుక్కల బాదం నూనె కలుపుకొని పెదాలకు రాసుకొంటే సమస్య దూరమవుతుంది .

పాల మీగడలో ,గులాబీ రేకల మిశ్రమం ,బాదం నూనె పెదాలకు రాసుకొంటే తగినంత తేమ అంది తాజాగా కనిపిస్తాయి .గులాబీ వర్ణంలో కాంతిమంతంగానూ ఉంటాయి.

రోజూ ఉదయాన్నే పంచదార ,తేనె సమానంగా తీసుకొని దానికి రెండు చుక్కల ఆలివ్ నూనె కలిపి రాసుకొంటే పగుల్లకు చక్కని సాంత్వన లభిస్తుంది .
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top