యవ్వనంతో ఆకర్షణీయంగా కనిపించేందుకు చిట్కాలు

నేటి స్త్రీలు చిన్ననాటి నుంచి వృద్ధాప్యం వరకు అందం కోసం ఎంతోకొంత ప్రాముఖ్యం  ఇస్తున్నారు.  కాని యవ్వన వయస్సులో మాత్రం ఎక్కువ ప్రాధాన్యత సౌందర్యం కోసమే ఇస్తారు. ఈ సౌందర్యం కోసం ఖరీదైన ఉత్పత్తులనే వాడాలనుకోవడం తప్పు. ఇంటిలో దొరికే పండ్లు, కూరగాయలతోనె ఆకర్షణీయంగా యవ్వన సౌందర్యం తెచ్చుకోవచ్చు.

గోళ్లు ఆరోగ్యంగా, సొగసుగా ఉండేందుకు చీజ్, గింజలు, వెల్లుల్లి, ఉల్లిపాయల్ని ఎక్కువగా తింటే చాలు. వీటిల్లో ఉండే పోషకాలు గోళ్లతో పాటు కురులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖానికి, చేతులు, మెడకీ సన్‌‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల ఆ ప్రాంతంలోని చాయలు కనిపించవు. పైగా ఏళ్లు గడిచినా యౌవనంగా కనిపిస్తారు.

 చేతులు ఏ మాత్రం పొడిబారినట్లు అనిపించినా.. ఆ ప్రాంతంలో నిమ్మచెక్క రుద్దుకోవాలి. దీనివల్ల చేతులు మృదుత్వాన్ని పొందుతాయి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే.. లిప్‌స్టిక్ తప్పనిసరిగా వేసుకోవాలి.

 జిడ్డు చర్మం ఉన్నవారికి పై పూతలతో ఎంతో మేలు జరుగుతుంది. మంచి గంధం పొడిలో కొద్దిగా పసుపు, బత్తాయి రసం వేసి ముఖం, మెడకు రాయాలి. ఆరాక చల్లని నీటితో కడిగితే ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది. సహజ చర్మతత్వానికైతే బత్తాయిరసం బదులు గులాబీనీటిని తీసుకోవాలి.


నాణ్యమైన టోనర్ లేదా గులాబీనీటిని కొద్దిగా ముఖంపై చల్లుకుంటే.. ముఖం తాజాదనంతో మెరిసిపోతుంది.

 కొద్దిగా క్రీం తీసుకుని దానికి ఫౌండేషన్‌ను కలపాలి. దీనివల్ల వేసుకున్న ఫౌండేషన్ కూడా ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.


 గోళ్లకు వేసుకునే బేస్‌కోట్‌కు కొద్దిగా వెల్లుల్లి రసం చేర్చితే.. బలహీనంగా కనిపించే గోళ్లు ఆరోగ్యంగా కనిపిస్తాయి.

 వారానికోసారి కొద్దిగా కొబ్బరినూనె లేదా బాదం నూనె తలకు రాసి.. సున్నితంగా మర్దన చేసి.. పది నిమిషాలయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కొబ్బరి పాలు చక్కగా పనిచేస్తాయి. పెద్ద చెంచాడు పాలని తలకు పట్టించి గంటయ్యాక కడిగినట్లైతే జుట్టు ఎంతో కోమలంగా మృదుత్వమును కలిగివుంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top