పనీర్ నూడుల్స్

కావలసిన పదార్దాలు : 
పనీర్ ముక్కలు 200 grams 
వెజ్ నూడుల్స్ 250  grams
నూనె 50 grams
తురిమిన ఉల్లికాడలు 1/2 కప్
క్యారట్ ముక్కలు 50 grams
బీన్స్ ముక్కలు 50 grams
టొమాటో సాస్ 2 tbsp
రెడ్ చిల్లీసాస్ 1 tsp
వెల్లుల్లి ముద్ద 2 tsp
సోయాసాస్ 1 tsp
తురిమిన కొత్తిమిర 1 tbsp
మిరియాల పొడి 1/4 tsp
అజినోమోటో 1/4 tsp
ఉప్పు తగినంత

తయారి  విధానం: సన్నగా, నిలువుగా కోసిన పనీర్ ముక్కల్ని కొద్దిపాటి నూనెలో వేయించాలి. కళాయిలో నూనె వేడి చేసి వెల్లుల్లి ముద్ద, ఉల్లికాడల తురుము, కొద్దిగా ఉడికించిన బీన్స్, క్యారట్,పనీర్ ముక్కలు వేసి కలపాలి. తర్వాత టొమాటో,చిల్లీ,సోయా సాస్ , మిరియాలపొడి, అజినోమోటో, తగినంత ఉప్పు వేసి సన్నపాటిసెగపై బాగా కలియబెట్టాలి. చివరగా ఉడికించి వార్చి పెట్టుకున్న నూడుల్స్ కూడా వేసి బాగా కలిపి కొత్తిమిర చల్లి వడ్డించాలి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top