వేసవిలో అందంగా ఉండాలంటే.. ఏం చేయాలి?

వేసవిలో మీ చర్మం మిలమిలమెరిసిపోవాలంటే.. పాలుతో కాస్త నిమ్మరసం చేర్చి ముఖానికి పట్టించి, పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే మీ చర్మం పొడిబారకుండా ఉంటుంది. అయితే మొటిమలుండే వారు దీనిని ఫాలో చేయకుండా ఉంటే మంచిది. 

వేసవిలో చెమట దుర్గంధానికి చెక్ పెట్టాలంటే.. గంధాన్ని పనీర్‌‌తో కలిపి శరీరానికి రాసుకుని స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే వేసవిలో గోల్డ్ ప్లేటెడ్ ఆభరణాలు ఉపయోగించే వారు కాస్త జాగ్రత్తలు పాటించాలి. మెడ భాగంలో నల్లబడితే ఓట్స్, గోధుమపిండిని పాలతో కలిపి మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. 

అలాగే చెమటకాయల నుంచి ఉపశమనం పొందాలంటే నీటిలో చందనాన్ని కలిపి రాసుకుంటే సరిపోతుంది. అలాగే బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుంటే వేసవిలో చర్మం మృదువుగా ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top