అందమైన చిరునవ్వు మీకు సొంతం అవాలంటె


అందమైన చిరునవ్వు ఎదుటి వారికీ మీ మీద మంచి అభిప్రాయాన్ని కలిగించటమే కాదుమీ మీద గౌరవాన్ని కూడా రెట్టింపు  చేస్తుంది. మరి అందమైన చిరునవ్వును సొంతం చేసుకోవాలంటే ముందు మీ పళ్ళు తెల్లగా, అందంగా మెరిసిపోవాలి.  మరి అందంగా మెరిసే పళ్ళ కోసం కొన్ని చిట్కాలు.

వంటసోడా, హైడ్రోజెన్ పేరాక్సేడ్ ను కొద్ది కొద్దిగా తీసుకుని ఈ మిశ్రంమాన్ని బ్రష్ తో పళ్ళ   మీద సున్నితంగా రుద్దాలి. హైడ్రోజెన్ పేరాక్సేడ్ పళ్ళను త్వరగా తెల్లగా చేస్తుంది. అయితే ఎక్కువ  మొత్తంలో హైడ్రోజెన్ పేరాక్సేడ్ ను ఉపయోగించరాదు. దీనిని ఉపయోగించిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం  చేసుకోవాలి.


పళ్ళ మీద పసుపు పచ్చని మరకలు పోగొట్టుకోవాలంటే నిమ్మ తొక్క చాలా బాగా పనిచేస్తుంది . నిమ్మ తొక్కను పంటి మీద  సున్నితంగా అప్లయ్ చేయాలి. నిమ్మరసాన్ని బ్రష్ తో అప్లయ్  చేసిన మంచి ఫలితాన్ని పొందవచ్చు. నిమ్మరసం లో కొద్దిగా రాళ్ల  ఉప్పు కలిపిన తర్వాత అప్లయ్ చేస్తే పంటి మీద పసుపు మరకలను త్వరితగతిన పోగొట్టవచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top