నడుము నొప్పికి వచ్చే సమస్యలు నివారణ పద్దతులు గురించి తెలుసుకుందాము

ఇటివల కాలంలో చాలా మంది స్త్రీల నోటి వెంట తరచూ వినిపిస్తున్న మాట నడుమునొప్పి. పురుషులలో కన్నా స్త్రీలలో ఈ సమస్య అధికంగా కనపడుతుంది. దీనికి కారణం స్త్రీలు ఇంట,బయట పని చేయటం ఒక కారణం. కేవలం ఉద్యోగులు మాత్రమే కాకుండా ఇంట్లో పని చేసే మహిళలకు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీని నివారణకు మందులు వాడుతూనే,కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి స్థాయిలో నివారణ సాధ్యం అవుతుంది. సాదారణంగా స్త్రీలు ఇంటిలో కొన్ని పనులు చేసినప్పుడు ఎక్కువగా నడుమునొప్పికి కారణం అవుతాయి. అలాగని అటువంటి పనులు మానకుండా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము.

సాదారణంగా ఇల్లు ఊడ్చే సమయంలో నడుము నొప్పికి గురవుతారు. నడుము వంచి ఊడవటం వలన నడుమునొప్పి వస్తుంది. ఇళ్ళు  ఊడ్చేటప్పుడు నడుము పై భాగం నుండి కాకుండా పిరుదుల దగ్గర నుండి వంగి ఊడ్చెందుకు ప్రయతించాలి. చీపురును శరీరం ముందు భాగమున ఉండేటట్లు పట్టుకొని చీపురుతో పాటు శరీరాన్ని కదులుస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఊడవటం వలన కొంత వరకు నడుము మీద భారం పడకుండా ఉంటుంది.

ఇల్లు ఊడ్చెటప్పుడు  నడుము మీద ఎంత భారం పడుతుందో ఇల్లు తుడిచేటప్పుడు అంత కన్నా ఎక్కువ భారం పడుతుంది. ఇలాంటప్పుడు నడుము పట్టేయటం మరియు నడుము నొప్పి ఎక్కువ అవటం జరుగుతుంది. వంగి కాకుండా మోకాళ్ళ మీద కూర్చుని తుడవటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయుట వలన నడుము మీద భారం తగ్గుతుంది. అవసరం అనుకుంటే మోకాళ్ళకు కట్టుకొనే ప్యాడ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి.

వంటగదిలో ఏర్పాటు చేసుకొనే సింక్ వల్ల కూడా కొన్ని సార్లు నడుమునొప్పి ఎక్కువ కావచ్చు. వంటగదిలో  సింక్ మీ ఎత్తుకు సరిపడే విధంగా ఉండాలి. అదే విధంగా సింక్ లోని టాప్ కూడా మరీ దూరంగా కాకుండా మీకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. టాప్ దూరంగా ఉంటే నడుము ఎక్కువగా వంచాలి. సింక్ కి సరిపడా ఎత్తులో స్టూల్ వేసుకొని కుర్చుని గిన్నెలు శుభ్రం చేసుకుంటే మంచిది.

బరువైన వస్తువులను పైకి ఎత్తటం,కింద నుండి నీళ్ళ బిందెలు పైకి మోయటం వంటి పనుల వల్ల కూడా నడుమునొప్పి వచ్చే అవకాశం ఉంది. బరువైన వస్తువులను ఒక్కసారిగా పైకి ఎత్తకుండా,మోకాళ్ళ మీద వంగి వాటిని పైకి లేపాలి. ఈ విధంగా చేయుట వలన నడుము మీద భారం పడకుండా ఉంటుంది. క్రమం తప్పకుండా వీపు,పొత్తికడుపు వ్యాయామాలు చేయుట వలన నడుమునొప్పి,కండరాలు పట్టేయటం,మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top