ఇండియాలో ఫెమస్ మరియు సంపన్న దేవాలయాలు

ప్రాచీనమైన కాలం నుంచి భారతదేశంలోని ఆలయాలకు విరాళాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఆ విరాళాలతో విగ్రహాలను తయారుచేసి పురాతన సంప్రదాయంతో పూజిస్తారు. 

దేశంలోని దేవాలయాలకు వచ్చే భక్తులు మరియు యాత్రికులు నుండి వస్తున్న నగదు మరియు విరాళాలు భారీ మొత్తంలో రావటంతో దేవాలయాలు సంపన్నం అవుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో సంపన్నమైన ఆలయాల గురించి తెలుసుకుందాం.

CLICKHERE :  గోళ్ళను బట్టి....మన ఆరోగ్యం

1. పద్మనాభస్వామి ఆలయం
ఈ ఆలయం తిరువంతపురంలో ఉన్నది. ఈ ఆలయంలో దాదాపు $ 20 బిలియన్ల విలువైన నిధిని కనుగొన్నారు. ఆరు సొరంగాలలో బంగారు నాణేలు,వజ్రాల నిధులు ఉన్నాయి.

2. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం
ఆంధ్ర ప్రదేశ్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. ఈ ఆలయానికి విరాళాలు,కానుకలు భారీ మొత్తంలో వస్తాయి. చాలా మంది ప్రముఖులు తరచుగా ఈ ఆలయానికి వస్తారు. 


ఇది జమ్మూలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది. హిందూ మతం యొక్క అత్యంత ముఖ్యమైన శక్తి పుణ్యక్షేత్రాలలో ఒకటి.

4. షిర్డీ సాయిబాబా ఆలయం
ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయం భారతదేశంలో అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. 


5. సిద్ది వినాయక ఆలయం 
ముంబై లో ఉన్న ఈ ఆలయం దేశంలోనే ధనిక ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఈ ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తు ఉంటారు. అంతేకాక అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు కూడా ఈ ఆలయానికి తరచుగా వస్తారు.

6. స్వర్ణ దేవాలయం
అమృతసర్ పవిత్ర నగరంలో స్వర్ణ దేవాలయం ఉంది. సిక్కు మందిరం బంగారంతో అలంకరింపబడి ఉంటుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వేల సంఖ్యలో ప్రతి రోజు వస్తూ ఉంటారు. 

7. సోమనాథ్ ఆలయం
సోమనాథ్ ఆలయం గుజరాత్ లో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉంది. ఈ దేవాలయం ఆక్రమణకు గురి అయిన సరే మంచి కీర్తితో ఉంది.

8. మీనాక్షి ఆలయం
తమిళనాడులోని మధురై లో ఈ అందమైన ఆలయం ఉంది. ఈ దేవాలయం పార్వతిదేవికి అంకితం అయి ఉంది.

9. జగన్నాథ దేవాలయం
జగన్నాథ దేవాలయం దేశంలో అత్యంత పురాతన మరియు చాలా సంపన్నమైన ఆలయం. ఇది ఒరిస్సా లోని పూరీలో ఉన్నది. ఈ ఆలయానికి లక్షల సంఖ్యలో భక్తులు విరాళాలను ఇస్తారు. ఇక్కడ రథయాత్ర ప్రత్యేకమైనది.

10 . కాశీ విశ్వనాథ్ ఆలయం
భారతదేశంలో ధనిక ఆలయాల్లో ఒకటైన ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ్ ఆలయం వారణాసి నగరంలో ఉంది. దేశంలో శివుడు కు అంకితమైన అత్యంత సందర్శించవలసిన దేవాలయాలలో ఒకటి.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top