బ్రహ్మి కామెడీ ఇక చూడలేమా...???

టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అంటే బ్రహ్మానందమే. ఆయన లేని సినిమా అంటూ ఉండదు. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా అన్ని సినిమాల్లోనూ బ్రహ్మి ఉండేవాడు. 

కామెడీ అంటే బ్రహ్మానందం...బ్రహ్మానందం అంటే కామెడీ అనే విధంగా ఉండేది. కొన్ని సినిమాల్లో పెద్ద హీరోల సైతం సీన్ హైప్ కోసం బ్రహ్మానందం మీద కొంత ఆధారపడేవారు. 

CLICKHERE : గర్భిణీలు ఎటువంటి ఆహారం తినకూడదు?

ఆయన ఏమి చేసిన ఒక అద్భుతం. తెరపై బ్రహ్మి కన్పిస్తే నవ్వులే నవ్వులు. కానీ ఇటీవల కాలంలో బ్రహ్మానందంనకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. 


కొన్ని బ్రహ్మి చేసుకున్నవి అయితే మరికొన్ని ఇతర కారణాలుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో బ్రహ్మి నటిస్తున్న సినిమాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు.

CLICKHERE : ప్రదీప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు

ఇటీవల కాలంలో కొత్త కమెడియన్స్ తెర మీదకు రావటంతో బ్రహ్మి జోరుకు బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఒకప్పుడు సునీల్,అలీ,M.S. నారాయణ వంటి వారు ఉన్నా బ్రహ్మికి ఉన్న ప్రాధాన్యత వేరు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారి కొత్త కమెడియన్స్ మీద దృష్టి పెడుతున్నారు దర్శక నిర్మాతలు. 


అంతేకాక తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్న సప్తగిరి వంటి కమెడియన్స్ సినిమా సినిమాకు వైవిధ్యం చూపటంతో దర్శక నిర్మాతలు కూడా కొత్తవారి వంక చూస్తున్నారు. దాంతో బ్రహ్మి ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది.




block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top