ముఖ సౌందర్యానికి ఫేషియల్ యోగా

వ్యాయామంతో పాటు సమతుల ఆహారం తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. తీసుకొనే ఆహారంలో తాజా పండ్లు,కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాగే తగినంత నీటిని తీసుకోవటం కూడా ముఖ్యమే. ఈ వ్యాయామాలను ప్రతి రోజు 5 నుంచి 7 నిమిషాల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. 

మెడను నిటారుగా ఉంచి కనుగుడ్లను పైకి కిందికి కదపాలి.

కనుబొమలను ముడిచి, నుదుటిపై అడ్డంగా, నిలువుగా మునివేళ్ళతో రుద్దాలి.

కళ్ళను గుండ్రంగా తిప్పాలి. ఆ తర్వాత కుడి..ఎడమ వైపులకు తిప్పాలి.

CLICKHERE : సుమ యాంకరింగ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా?

అరచేతులు బాగా రుద్దుకుని కళ్ళపై ఉంచితే కొంచెం ఉపశమనం కలుగుతుంది.

ఉదయం మరియు రాత్రి సమయంలో కళ్ళను చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మీ ముక్కును కాస్త తెరిచేలా ఉంచండి. అలాగే మూసేలా ఉంచండి. కిందకు పైకి ముక్కును కదుపుతూ ఉండాలి.

CLICKHERE కాఫీ త్రాగితే కొలస్ట్రాల్ పెరుగుతుందా?

నోటిని బాగా తెరచి ఆ తర్వాత మూయాలి. ఈ విధంగా నాలుగునుంచి ఐదు సార్లు చేయాలి. దీంతో ముఖానికి మంచి వ్యాయామం జరిగి రక్త ప్రసరణ బాగా జరగటానికి అవకాశం ఉంటుంది.

దవడలను కుడి-ఎడమలకు తిప్పాలి.

మీ పెదాలను ముడచుకోండి, మళ్ళీ విప్పార్చండి.

దంతాలను బయట కనపడేలా చేసి ఆ తర్వాత నోటిని మూయాలి.

నోట్లో గాలి నింపి బెలూన్‌లా చేసి,ఆ తర్వాత గాలిని బయటకు వదలాలి.

CLICKHERE బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్‌ చేసుకుందామా

మీ కింది దంతాలను పై దంతాలతో కాసేపు అదిమి పట్టి నొక్కాలి.


మెడపైభాగంలోనున్న చర్మాన్ని లాగండి. మీ దవడలను బాగా టైట్ చేయండి.

మెడను వెనక్కి వంచాలి. ఈ విధంగా 10 సార్లు చేయాలి.

నోట్లో నీరు పోసుకొని పుక్కలించాలి.

CLICKHERE : అల్లరోడు భార్య ఏమి చేస్తుందో తెలుసా?

CLICKHERE : నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది?

Share on Google Plus