ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారు....ఎలా?

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు పెద్దలు. ప్రతి రోజు మనం కూరల్లో ఉల్లి ఉపయోగిస్తుంటాం. అయితే కొందరు మాత్రం ఉల్లికి ఉండే ఘాటైన వాసన కారణంగా దానిని తినడానికి ఇష్టపడరు. 

కానీ ఉల్లిలో ఎన్నో పోషక ఉన్నాయి. అనేక జబ్బుల నుంచి మనం బయట పడటానికి ఉల్లి ప్రత్యామ్నాయ మందుగా చెప్పవచ్చు. ఉల్లి వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

CLICKHERE : ఆగస్ట్ నెలలో పుట్టిన సెలబ్రెటీలు ఎవరో తెలుసా?

వివిధ రోగాల బారిన పడకుండా ఉల్లిపాయలో ఉండే అనేక రసాయనాలు ఉపయోగపడుతాయి. ప్రతి రోజు ఆహారంలో ఉల్లిపాయను తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది.

ఉల్లి వల్ల కలిగే ప్రయోజనాలకు మనం ఇప్పుడు తెలుసుకుందాం

* ఉల్లిపాయలో యాంటిబయోటిక్, యాంటిసెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మనం ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతాయి.

CLICKHERE : కొబ్బరి నూనెతో బ్రష్ చేస్తే...ఏమవుతుందో తెలుసా?



* ఉల్లి వివిధ రసాయనాల సమ్మేళనం. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి.

* ఉల్లిని ప్రత్యామ్నాయ మందుగా చెప్పవచ్చు. ఉల్లిపాయ రసం మరియు తేనె ల మిశ్రమంను తీసుకుంటే జ్వరం, సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలెర్జీల వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది.

* ఉల్లిపాయ ముక్కను నుదుటి మీద పెడితే జ్వరం యొక్క దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది.

CLICKHERE : బొటన వేలును బట్టి మీరు ఎలా ఉంటారో చెప్పవచ్చు....ఎలా ?


* వేసవిలో చిన్న పిల్లలకు కాని పెద్దలకు కాని కొన్ని సందర్భాల్లో ముక్కులో నుంచి రక్తం రావటం గమనిస్తూ ఉంటాం. అయితే ఉల్లిపాయ ముక్క వాసనను పిల్చేతే, ముక్కు నుండి వచ్చే రక్త స్రావాన్ని ఆపవచ్చు లేదా వేగాన్ని తగ్గించవచ్చు.

* ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఇది ఖచ్చితంగా మంచి నిద్రను ఇస్తుంది.

* జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు ఉల్లిపాయను తింటే జీర్ణక్రియకు సహాయం చేసే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

CLICKHERE : టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే....షాక్

* ఉల్లిపాయ రసం కాలిన చర్మం లేదా కీటకాల కాటు లేదా తేనెటీగ కాటులను నయం చేయటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

* ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి. ఇది తల, మెడ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.

* ప్రతి రోజు ఆహారంలో ఉల్లిపాయను బాగంగా చేసుకుంటే, అస్టియోపోరోసిస్ మరియు అథెరోస్క్లెరోసిస్ నుండి రక్షణ కలుగుతుంది.

* ఉల్లిపాయలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచటానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి.

CLICKHERE : చిన్న వయస్సులో చనిపోయిన హీరోయిన్స్


* ప్రతి రోజు ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అంతేకాక మంచి కొలస్ట్రాల్ ను పెంచి కొరోనరీ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.

* కీళ్ళలో ఆర్థరైటిస్ తగ్గించటానికి ఉల్లిపాయ సహాయపడుతుంది.

* నువ్వుల నూనె లేదా అముదంలో ఉల్లిపాయలను వేగించి ఉపయోగిస్తే ఒంటి నొప్పులు మాయం అవుతాయి.

* ఉల్లిపాయ రసంలో పసుపు కలిపి ముఖానికి రాస్తే నల్లని పాచెస్ లేదా పిగ్మేంట్ తొలగించటానికి సహాయపడుతుంది.

* ఉల్లిపాయ రసంను చెవి మరియు కంటి సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top