పుల్లారెడ్డి స్వీట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

హైదరాబాద్, స్వీట్ షాప్ అనగానే మనకు ముందుగా పుల్లారెడ్డి స్వీట్ షాప్ గుర్తుకు వస్తుంది. ఒక సాధారణ మిఠాయి దుకాణం వ్యక్తి...ఈ రోజున దేశం దాటి వెళ్లి వ్యాపారం చేస్తున్నాడంటే మాటలు కాదు. దాని వెనక ఎంత కృషి, పట్టుదల ఉన్నాయో తెలుసుకుందాం. 

CLICKHERE : బాద్షా ఇంటి విలువ తెలిస్తే...షాక్

జి.పుల్లారెడ్డి కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని గోకవరంలో జన్మించారు. ఆయనకు చదువు అబ్బకపోవటంతో కసిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యాపారి బంగారం దుకాణంలో పనిచేసేవారు. కొంత డబ్బు సంపాదించాక చేసే పని మానేసి సొంతంగా టీ, మజ్జిగ అమ్మే కొట్టును ప్రారంభించారు. 

CLICKHERE : కూల్ డ్రింక్స్ గురించి నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వెంకటరెడ్డి స్వీట్స్ వ్యాపారం ప్రారంభించాలని కోరిక కలిగింది. అయితే ఉన్న బంగారు వ్యాపారం మిఠాయి దుకాణం రెండు చూసుకోవటం కష్టం అవుతుందని భావించి అప్పట్లో రూ. వెయ్యి అప్పు ఇచ్చి మరీ పుల్లారెడ్డి చేత బలవంతంగా కర్నూల్‌లోని పాతబస్టాండ్ ప్రాంతంలో మిఠాయి కొట్టును తెరిపించాడు కసిరెడ్డి వెంకటరెడ్డి. అలా మొదలైన పుల్లారెడ్డి స్వీట్స్ ప్రస్థానం.. కర్నూల్‌లో 4, హైదరాబాద్‌లో 8, బెంగళూరులో 6 ఔట్‌లెట్లతో స్వీట్స్ వ్యాపారంలో ముందుకు దూసుకుపోతోంది.


CLICKHERE : నాలుగు చుక్కలతో దోమల ఆట కట్

ప్రస్తుతం 18 పుల్లారెడ్డి దుకాణాలు రూ.45 కోట్ల టర్నోవర్ తో నడుస్తున్నాయి. జీడిపప్పు పాకం, కోవాపురి, అజ్మీరీ కలాకాన్ అనేవి పుల్లారెడ్డి స్వీట్స్ లో ప్రత్యేకమైనవి. ఈ వ్యాపారాన్ని మారిషస్‌కూ విస్తరించే ఆలోచనలో ఉన్నారు. 

CLICKHERE : మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలియని విషయాలు

స్వీట్ల తయారీకి అవసరమైన పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని సొంత ల్యేబొరేటరీలో పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేస్తారు. నంద్యాల, తమిళనాడు నుంచి నెయ్యిని దిగుమతి చేసుకుంటారు. రోజుకు 20 డబ్బాలు (ఒక్కోటి 15 కేజీలు) కొనుగోలు చేస్తారు. పాలు రోజుకు 1,500 లీటర్లు కొంటారు. సుగంధ ద్రవ్యాలు, ఇతరరత్రా దినుసులన్నీ బేగంబ జార్ నుంచే కొనుగోలు చేసుకుంటారు. 

CLICKHERE : నాగార్జున‌కు త‌ల‌నొప్పిగా మారిన కొడుకులు

1954 లో పుల్లారెడ్డి స్వీట్స్ రాజ్ భవన్ కి ఆఫీసియల్ గా స్వీట్ సుప్లయర్ గా గుర్తింపు పొందారు.పుల్లారెడ్డి అనేక విద్యా, సాంఘిక మరియు స౦క్షెమ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అలా స్థాపించిన సంస్థలలో ఒకటి “జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి”, కర్నూలు. హైదరాబాదులో ఈయన భార్యపేరు మీదుగా స్థాపించిన నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాల కేవలం మహిళలకోసమే ప్రత్యేకించబడినది.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top