మీ ఫేవరెట్ హీరోలు వాడే లగ్జరీ కార్ల గురించి తెలుసా..?

ప్రస్తుత రోజుల్లో బైక్ లకు, కార్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మార్కెట్ లోకి ఏ కొత్త మోడల్ బైక్ వచ్చినా, కార్ వచ్చినా సరే.. వీలు కుదిరితే కొని రై.. రై మంటూ చక్కర్లు కొట్టేస్తుంటారు కుర్రకారు. ఇలా కొత్తమోడల్ కార్లు, బైక్లు కొనడంలో మన టాలీవుడ్ హీరోలు కూడా ఏ మాత్రం తీసిపోరు.

తమ రీల్ లైఫ్ లో ఏదో ఒక కొత్త మోడల్ బైక్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న హీరోలు.. రియల్ లైఫ్ లో వాడే లగ్జరీ కార్లేమిటో చూసేద్దాం.. 




CLICKHERE : మన బుల్లితెర హీరోయిన్స్ ఒక్క రోజు రెమ్యునేషన్ ఎంతో తెలుసా?


సినీ శ్రీమంతుడిగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు... రెండు కోట్ల ఖరీదు ఉన్న రేంజోవర్ కార్ ను ఉపయోగిస్తున్నాడు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తన క్రేజ్ కు తగ్గట్టుగానే 8 కోట్ల రూపాయలతో రోల్స్ రాయసీ ఫాంటమ్ కార్ ను కొని ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఉపయోగిస్తున్న కార్లలో ప్రభాస్ దే లగ్జరీ కార్ కావడం విశేషం.

CLICKHERE : జబర్జస్ట్ శాంతి స్వరూప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు


ఇక అన్న చిరంజీవి 3 కోట్ల రూపాయలు విలువ చేసే రోల్స్ రాయసీ ఫాంటమ్ కార్ లో తిరుగుతుండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ 85లక్షలు విలువ చేసే ఆడి క్యూ- 7 సిరీస్ కార్ ను ఉపయోగిస్తూ తన సింపుల్ సిటీని మరోసారి బయటపెట్టాడు. అయితే ఈ మధ్య ఆ కార్ ను అమ్మేశాడంటూ ప్రచారం జరిగినా అది రూమర్ గానే మిగిలింది.

CLICKHERE : పానీపూరి తింటున్నారా..? అయితే ఇది చదవండి..!

అలాగే జూ. ఎన్టీఆర్ 2.5 కోట్ల విలువచేసే పోర్షే 911 స్పోర్ట్స్ మోడల్ కార్ లో తిరుగుతుండగా, అల్లు అర్జున్.. కోటి రూపాయల విలువ గల BMW X.. 6 సిరీస్ ను, రామ్ చరణ్ 5.8 కోట్ల విలువ చేసే ఆస్టన్ మార్టిన్ v8 వాంటేజ్ కార్ ను, మాస్ మహరాజా రవితేజ 1.5 కోట్ల విలువ గల మెర్క్ S. క్లాస్ కార్ ను, బాలకృష్ణ 1.5 కోట్ల విలువగల BMW -7 సిరీస్ ను ఉపయోగిస్తున్నారు. అయితే నాగ చైతన్య మాత్రం కేవలం 60లక్షలు విలువగల BMW 325 కార్ లో తిరగడం గమనించాల్సిన విషయం.

COOKINGTIPS 

కేకు గుడ్డు వాసన రాకుండా ఉండాలంటే.....


ఆవకాయ బూజు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే......
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top