రాజ‌మౌళి బాహుబ‌లికి బాల‌య్య పంచ్‌….!

రాజ‌మౌళి బాహుబ‌లికి బాల‌య్య పంచ్ వేశాడా..? ఆ సినిమాపై ఆయ‌న ప‌రోక్షంగా కామెంట్స్ చేశాడా…? ఇదే ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమ‌లో హాట్ టాపిక్‌గా మారింది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్ర‌యిల‌ర్ సంద‌ర్భంగా బాల‌య్య చేసిన కొన్ని వ్యాఖ్య‌లు ఆసక్తిక‌రంగా మారాయి. రెండు మూడేళ్లు తీయాల‌నుకోలేదు… క‌థ‌ని న‌మ్ముకున్నాం.. శ‌ర‌వేగంగా తీసేశాం.. చిన్న ప్ర‌య‌త్నం కాదిది… చాలా చాలా పెద్ద ప్ర‌య‌త్నం.. క‌థ అద్భుతంగా వ‌చ్చింది… సినిమా ఇంకా అద్భుతంగా వ‌చ్చింది.. ఈ వ్యాఖ్య‌లు బాల‌య్య త‌న సినిమా గురించి చెప్ప‌డానికి అన్నారో లేదో కానీ, విమ‌ర్శ‌కులు మాత్రం అవి రాజ‌మౌళి బాహుబ‌లిపైనే అని అంటున్నారు.


CLICKHERE : బన్ని ప్రేమ కథలో ట్విస్ట్ తెలిస్తే షాక్

రాజ‌మౌళి బాహుబ‌లి సినిమా సంగ‌తి తెలిసిందే.. ఈ సినిమాని నాలుగేళ్లుగా తెర‌కెక్కిస్తున్నాడు. ఒక పార్ట్ రిలీజ్ అయినా.. ద్వితీయ భాగం విడుద‌ల‌కు ఇంకా అయిదు నెల‌లు టైమ్ ఉంది.. సుదీర్ఘ‌కాలంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా రికార్డ్‌లు కొల్ల‌గొట్టినా.. బాహుబ‌లి మొద‌టి భాగంపై వ‌చ్చిన విమ‌ర్శ‌లు అన్నీ ఇన్నీ కావు. క‌థ‌, క‌థ‌నంలో స్పార్క్ మిస్ అయింద‌నే విమ‌ర్శ‌లు మూటగ‌ట్టుకుంది. కంటెంట్ త‌గ్గింద‌నే కామెంట్స్‌ను పొందింది.ఈ సినిమాని కూడా దాదాపు 2ఏళ్లు శ్ర‌మ‌ప‌డి తెర‌కెక్కించాడు రాజ‌మౌళి. అలాంటిది క్రిష్‌… త‌న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిని.. అందులోనూ పూర్తి చారిత్ర‌క గాథ‌ను తెర‌కెక్కించడానికి తీసుకున్న స‌మ‌యం కేవ‌లం 6 నెల‌లు.

CLICKHERE : మన స్టార్ హీరోలు సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవారు?
6 నెల‌ల‌లో ఆయ‌న శాత‌క‌ర్ణిని రిలీజ్‌కి కూడా రెడీ చేశాడు. ఇటు, విజువ‌ల్స్ ప‌రంగా కూడా చాలా రిచ్‌గా క‌నిపిస్తోంది శాత‌క‌ర్ణి. అయితే, గ్రాఫిక్స్ ఎలా వ‌చ్చాయి అనేది ఇంకా తెలియ‌దు. కానీ, సినిమాపై పెట్టుబ‌డి ప‌రంగా బాహుబ‌లితో దీనిని కంపేర్ చెయ్య‌లేం. దీని బ‌డ్జెట్ చాలా త‌క్కువ‌. దీంతో, బాల‌య్య కౌంట‌ర్ వేసింది బాహుబ‌లికే అని చర్చ న‌డుస్తోంది టాలీవుడ్‌లో. అయితే, జ‌క్క‌న్న మాత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్ర‌యిల‌ర్ చూసి అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చాడు. బాల‌య్య అభిమానులు మాత్రం ఆయ‌న ఆ కామెంట్స్ జ‌న‌ర‌ల్‌గా చేసిన‌వే కానీ, బాహుబ‌లిని టార్గెట్ చేసి కాద‌ని చెబుతున్నారు. మ‌రి, ఈ కామెంట్స్ ర‌చ్చ ఇక్క‌డితో ఆగుతుందా..? మ‌రింత వివాదానికి దారితీస్తుందా..? అనేది చూడాలి.

CLICKHERE : క్యాష్ లెస్ అస‌లు సీక్రెట్ ఇదీ.. అదిరిపోయింది బాస్ మోదీ ఆలోచ‌న‌…!

CLICKHERE : పాదాల వాపు రావటానికి కారణాలు తెలుసా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top