శశికళ ఎమ్మెల్యేలను దాచిన హోటల్‌ అసలు కథ ఇది

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం తన ఆరాధ్య నేత జయలలిత సమాధి సాక్షిగా చేసిన సంచలన ప్రకటన తమిళనాడు ప్రజలనే కాదు, యావతదేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అతిపెద్ద రాజకీయ సామ్రాజ్యంగా ఉన్న అన్నాడీఎంకే ‘పన్నీర్‌ పంచ్’తో చీలిపోయింది. ప్రజలు ఇష్టపడితే ముఖ్యమంత్రి పదవిని మళ్లీ చేపడతా అని పన్నీర్‌సెల్వం తన మనసులో మాట బయటపెట్టి, తనతోపాటు పలువురు శాసనసభ సభ్యులు ఉన్నారు, శాసనసభలో బలం నిరూపించుకుంటానని చెప్పడంతో శశికళ అప్రమత్తమయ్యారు.

CLICKHERE : రాజమౌళి ప్రభాస్ తో మహాభారతం ?

ఎమ్మెల్యేలు తన చేయి దాటిపోకుండా, పన్నీర్‌సెల్వం చెంతకు చేరకుండా అపేందుకు అందర్నీ తన కట్టుబాటులో పెట్టుకొనే ప్రయత్నానికి దిగారు. అందర్నీ రెండు బస్సుల్లో నగరానికి దూరంగా ఉన్న రిసార్ట్స్‌లో ఉంచారు. ఈ చర్యతో శశికళ తీవ్ర విమర్శలు, కోర్టులో కేసులు ఎదుర్కోవాల్సి వస్తోంది. రాజకీయపోరులో ఇవన్నీ సహజమే కాబట్టి అది పక్కనపెడితే... ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌పై అందరి దృష్టి పడింది. ఇంతకీ ఆ హోటల్‌ ఎక్కడుంది? అందులోని విశేషాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోకతప్పదు. 

CLICKHERE : రానాతో ప్రభాస్ '2 కోట్ల' బేరం....ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

గత బుధవారం అన్నాడీఎంకే కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన తరువాత 120 మందికిపైగా ఎమ్మెల్యేలను రెండు లగ్జరీ బస్సుల్లో ఎక్కించి పంపించేశారు. మొదట విమానాశ్రయం సమీపంలోని స్టార్‌ హోటల్‌లో బస ఏర్పాటుచేయగా, రాత్రికి వారి బస మహాబలిపురం సమీపంలోని కల్పాక్కం వద్ద ఉన్న గోల్డెన్ బే రిసార్ట్‌కి మారింది. ఈ రిసార్టు ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులోని కూవత్తూర్‌ ప్రాంతంలో ఉంది. చుట్టూ నీళ్లతో ఒక దీవిని తలపించేలా ఉంటుంది.

CLICKHERE : పవన్‌ 3 వ విడాకులపై క్లారిటీ వచ్చేసింది

అంతేకాదు, చల్లగా వీచే సముద్రగాలి ఈ రిసార్ట్‌కి అదనపు ఆకర్షణ. ఇక సకల లగ్జరీ సదుపాయాలతో రోజుకి రూ.5,500, రూ.6600, రూ.9,900ల ధరతో మూడు విధాలైన రూములున్నాయి. పార్టీ హాలు, డిన్నర్‌ హాలు సదుపాయాలున్నాయి. షికారు చేసేందుకు బోటింగ్‌, బోటులోనే డిన్నర్‌, సాహస క్రీడల్లో ఆసక్తి ఉన్నవారి కోసం ట్రెక్కింగ్‌, మోటార్‌ సైక్లింగ్‌ వంటి మరిన్ని వసతులున్నాయి. మసాజ్‌ సెంటర్‌, జిమ్‌ సరేసరి. దీంతో ఈ రిసార్టులో ధనవంతులు, విదేశీ పర్యాటకులు మాత్రమే బస చేస్తుంటారు. 

CLICKHERE : ఎన్టీఆర్ నుండి వంశీ ఎలా దూరం అయ్యాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలు అత్యంత సౌకర్యవంతంగా ఉండేందుకు సకల సదుపాయాలూ ఉన్నాయి. అయితే వారిని బయట వ్యక్తులతో, కనీసం కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా చేశారన్నది వివాదాస్పదంగా మారింది. సెల్‌ఫోన్లు కూడా లాగేసుకున్నారని పలువురు ఎమ్మెల్యేలు వాపోగా, మరికొందరు రిసార్టులో బాగానే ఎంజాయ్‌ చేశారని చెప్పుకొంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top