వామ్మో..పెళ్ళికి ముందే భార్యకు అంత పెద్ద కండిషన్ పెట్టాడా..?


సినిమా స్టార్స్ చాలా మంది ప్రేమ వివాహాలు చేసికుని హాయిగా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లిస్టు లోకే వస్తారు మంచు విష్ణు, మంచు మనోజ్. విష్ణు భార్య వెరోనికా ద్వారా పరిచయమైనా ప్రణతితో ప్రేమలో పడి.. ఆమెనే పెళ్లి చేసుకున్నాడు మనోజ్. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాలు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఐతే పెళ్లికి ముందు మనోజ్.. తన భార్యకు ఒక కండిషన్ పెట్టాడట. దానికి ఓకే అన్నాకే ఆమెను పెళ్లాడాడట. ఆ కండిషన్ ఏంటో మనోజ్ నే అడిగి తెలుసుకుందామా..నా భార్య నాకు మంచి స్నేహితురాలు. 

CLICKHERE : జియో ప్రైమ్ వల్ల కలిగే లాభాలు... తీసుకోకపోతే కలిగే నష్టాలు!

ఆమెతో పెళ్లికి ముందే ఒక మాటచెప్పాను. నేను ఆర్టిస్టుని. డబ్బు దాచుకోవడం రాదు. ఇంట్లో డబ్బు అడగను. పరిస్థితులు బాలేకపోతే ఒకరి ముందు చెయ్యి చాచడం నాకు అలవాటు లేదు. భవిష్యత్తులో చిన్న గుడిసెలోకి వెళ్లాలంటే నాతో పాటు వచ్చేయాలి అన్నాను. అందుకు ఆమె ఓకే చెప్పింది. ఎక్కడికైనా వస్తానని ఆమె నాతో ఏడడుగులు వేసిందని మనోజ్ చెప్పాడు.

CLICKHERE : కంటి అద్దాల వలన ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చల నివారణకు చిట్కాలు

తాను ఏ సినిమాలు చేస్తున్నాను.. ఎంత సంపాదిస్తున్నాను అన్నది తన భార్య ఎప్పుడూ అడగదని.. ఆమెకు సినిమాలంటే ఇష్టమని.. తాను చేసే సినిమాల్లో ఏదైనా సీన్ ఓవర్ గా అనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేస్తుందని… అప్పుడప్పుడూ కొన్ని సలహాలు ఇస్తుంటుందని మనోజ్ తెలిపాడు. సినిమాల ఎంపిక విషయంలో కూడా భార్య ప్రణతి కానీ తండ్రి మోహన్ బాబు కానీ ఎప్పుడూ జోక్యం చేసుకోరని చెప్పుకొచ్చాడు మనోజ్. మొత్తానికి పెళ్ళికి ముందే ముందు జాగ్రతగా షరతలు వర్తిస్థాయి అంటూ భార్యను ఇలా కంట్రోల్ లో పెట్టుకున్నాడు రాకింగ్ స్టార్.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top