బ్రహ్మానందం ఆఫర్లు తగ్గడానికి ఆ హీరో లు కారణమా?


హీరో రోల్ కంటే ఎక్కువగా బ్రహ్మానందం రోల్ ని డిజైన్ చేయడానికి ఎక్కువ మంది దర్శకులు తమ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుండి బ్రహ్మానందం దాదాపు 1000 సినిమాలలో నటించాడు. సినిమా పరిశ్రమ లోకి ఎంత మంది కమెడియన్లు వచ్చిన బ్రహ్మానందమును దరిదాపులలోకి వేళ్ళలేరని చాలామంది అనుకునేవారు. 

అయితే గత ఏడాది నుండి బ్రహ్మానందం కెరీర్ ఒక సరిగా పడిపోవడం చాలా మంది గమనించి వుండరు. ఒకప్పుడు బ్రహ్మానందం లేని పెద్ద హీరో సినిమా లేదనే స్థాయి నుంచి ఇప్పుడు బ్రహ్మానందం పెద్ద హీరో సినిమాలో భూతు అద్దం పెట్టి వెతికిన కనిపించని పరిస్థితి వచ్చేసింది.కొందరు హీరో లు దర్శకులు కేవలం బ్రహ్మానందం ఇమేజ్ మీదే ఆధారపడుతున్నారని అయన లేకపోతె వాళ్ళ పనై పోయినట్లే అన్న ప్రచారం జరిగింది. కానీ కొందరు స్టార్ హీరో లు తమ సినిమాకు బ్రహ్మానందం అవసరం లేదని దర్శకులకు తెగిసి చెప్పారంట.

సినిమా పరిశ్రమ లో హీరోలని కాదని మిగితా స్టార్స్ కి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు కావున బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్ పైన ఈ ప్రభావం పడిందంటా. దీనితో గత ఏడాది ఎన్నడూ లేని విధముగా బ్రహ్మానందం ఖాళీగా వున్నాడని పరిశ్రమ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఇప్పుడు ఇప్పుడే బ్రహ్మానందం కెరీర్ ఊపందుకుంటున్న అయన మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవడం అంత సులభం కాదని కొందరు చర్చించుకుంటున్నారు.
మరి పక్క కొందరు కమెడియన్ లు జబర్దస్త్ వంటి షో ల ద్వారా పాపులర్ అయిన స్టార్స్ లాగా పెరగడం కూడా బ్రహ్మనందం కు మైనస్ అంది అయిన గుసగుసలు మొదలయ్యాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top