వెంకన్న వైభవం పై నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ డాక్యుమెంటరీ స్టోరీ


నిత్య కల్యాణం, పచ్చ తోరణం… 24 గంటలూ భక్తులతో కిటకిటలాడుతుండే వీధులు… లక్షల మంది ఆకలి తీర్చే అన్నసత్రాలు, నిత్యసేవలు, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలు… తిరుమలగిరులపై వెలసి భక్తుల కొంగు బంగారమైన వెంకన్న వైభవం ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ స్థాయిలో పేరున్న నేషనల్ జియో గ్రాఫిక్ చానల్ సైతం వెంకన్న వైభవానికి అబ్బురపడిపోయింది. ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న అన్నదానాలపై ‘మెగా కిచెన్’ పేరిట డాక్యుమెంటరీ ప్లాన్ చేసుకుని, అందులో భాగంగా రెండు నిమిషాల క్లిప్పింగ్స్ కోసం తిరుమలకు వచ్చిన ఎన్జీసీ టీమ్, వెంకన్న వైభవాన్ని స్వయంగా తిలకించి, ‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్ స్టోరీ’ పేరిట ఏకంగా రెండు ఎపిసోడ్ లతో 43 నిమిషాల డాక్యుమెంటరీని తీసింది.

CLICKHERE : ఫేస్ బుక్, జీమెయిల్ ద్వారా ఓటు వేసి మన తెలుగోళ్లని గెలిపించండి.


ఒక ప్రదేశాన్ని లేదా ఒక అంశాన్ని చిత్రీకరించాలంటే ఎన్జీసీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రసారం చేయబోయే అంశాలకు సంబంధించి ముందస్తుగా సమగ్ర అధ్యయనం చేస్తుంది. ఆ క్రమంలోనే తిరుమల క్షేత్రాన్ని ఎనజీసీ సాంకేతిక బృందం ఆరు నెలలకు ముందే సందర్శించి క్షుణ్నంగా పరిశీలించింది. ఆ తర్వాత..ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ రాజేంద్ర నేతృత్వంలో.. ఇద్దరు కెమెరా మెన్‌, ఒక స్ర్కిప్ట్‌ రైటర్‌, ఇద్దరు అసిస్టెంట్లు.. వెరసి ఆరుగురు సభ్యుల చానల్‌ బృందం ఈ చిత్రీకరణలో పాల్గొంది. రికార్డింగ్‌కు రెండు కెమెరాలు వినియోగించారు. మే నెలలో 10 రోజులు, బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్‌లో పది రోజులకు పైగా తిరుమలలో ఉండి చిత్రీకరించారు.

CLICKHERE : నిన్న ఆడియోలో బయట పడ్డ లుకలుకలు... అవి తెలిస్తే షాక్ అవుతారు


మొత్తం ఆరుగురు సభ్యులున్న ఈ బృందం తీసిన డాక్యుమెంటరీ ఈ రోజు రాత్రి ప్రసారం కానుంది. ఏళ్ల తరబడి క్రమం తప్పకుండా తిరుమలకు వస్తున్న భక్తుల అభిప్రాయాలు, వారిలో తన్మయత్వంతో కూడిన భావోద్వేగాలను ఎన్జీసీ కెమెరామెన్లు చక్కగా చిత్రీకరించారని స్వయంగా టీటీడీ సభ్యులే చెబుతున్నారు. నిబంధనల్లో భాగంగా, ఈ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులకు చూపించగా, వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

CLICKHERE : మార్చి 31 తరువాత జియో సిమ్ పడేయొద్దు .. ఎందుకంటే

శ్రీవారి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా ఈ డాక్యుమెంటరీ ఉందని వెల్లడించారు. నేష‌న‌ల్ జాగ్ర‌ఫిక్‌ ఛాన‌ల్‌లో శ్రీ‌నివాసుని వైభ‌వం క‌లియుగ వైకుంఠం తిరుమ‌లపై నేష‌న‌ల్ జాగ్ర‌ఫిక్ ఛాన‌ల్ డాక్యుమెంట‌రీ రూపొందించింది. ‘తిరుమల తిరుపతి: ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో ఈ డాక్యుమెంట‌రీ ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. దీని నిడివి 43 నిమిషాలు. రెండు ఎపిసోడ్‌లుగా దీన్ని చిత్ర‌క‌రించారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top