షాకింగ్: ఆర్తి అగర్వాల్‌ చనిపోవడానికి కారణం వాళ్ల ఫ్యామిలీయే!!


తెలుగులో వెంకటేష్‌ నటించిన ‘నువ్వునాకు నచ్చావ్‌’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, తక్కువ సమయంలోనే భారీ క్రేజ్‌ను దక్కించుకున్న ముద్దుగుమ్మ ఆర్తిఅగర్వాల్‌. ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే వరుసగా ఆఫర్లు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది. అయితే ఆ క్రేజ్‌ కొంత కాలానికే తగ్గింది. హీరోలతో అఫైర్‌ మరియు ఇతరత్ర కారణాల వల్ల ఈ అమ్మడు అవకాశాలు కోల్పోయింది. దాంతో పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాలని భావించింది. పెళ్లి అయిన కొన్నాళ్లకే భర్తతో ఆర్తి విడాకులు తీసుకుంది. అందుకు కారణం ఆర్థిక అంశాలే అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే..

హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఆర్తి అగర్వాల్‌ బాగా సంపాదించింది. ఆ డబ్బును తల్లిదండ్రులు మరియు చెల్లెలు పేరుతో ఆస్తులు కొనుగోలు చేసింది. ఆ ఆస్తులను ఆర్తి అగర్వాల్‌ భర్త తీసుకు రావాల్సిందిగా డిమాండ్‌ చేశాడట. అయితే ఆ ఆస్తులను ఇచ్చేందుకు ఆర్తి అగర్వాల్‌ కుటుంబ సభ్యులు నిరాకరించారని సమాచారం. దాంతో ఆర్తి అగర్వాల్‌ భర్త ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆస్తుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులతో విభేదించింది. మళ్లీ హీరోయిన్‌ అయ్యి డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేసింది. అయితే లావు ఎక్కువ అవ్వడంతో పాటు, మునుపటి అందం లేక పోవడంతో ఆర్తి అగర్వాల్‌కు ఛాన్స్‌ రాలేదు. ఆ కారణంగానే మళ్లీ అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో లైపో చేయించుకుంది. లైపో ఆపరేషన్‌ వికటించడం వల్లే ఆర్తి అగర్వాల్‌ మృతి చెందింది. అందుకే ఆర్తి అగర్వాల్‌ మృతి చెందడానికి పరోక్షంగా ఆమె కుటుంబ సభ్యులు కారణమని ఇప్పుడు టాలీవుడ్ వర్గాలు సానుభూతి ప్రకటిస్తున్నాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top