అవార్డులు అమ్ముడు పోతున్నాయి: మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు…!!

ఒక నటుడి అద్భుత నటనకు గాను ప్రభుత్వం వారి ఇచ్చే గౌరవమైన పురస్కారమే అవార్డు. అయితే ఈ వార్డులు కొంత మందికి కొన్ని సమయాల్లో డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారని మహేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అవార్డులను కొందరు నటులు డబ్బులు చెల్లించి కొనుక్కుంటున్నారని ఇప్పటివరకు చాలా మంది నటులు మీడియా ముందు ప్రస్తావించారు.

అయితే ఇటీవల మహేష్ మీడియా తో ఇచ్చిన ఇంటర్వ్యు లో కొందరు అవార్డులను కొనుక్కుంటున్నారని ప్రస్తావించారట. ఓసారి నంది అవార్డ్స్ నిర్వాహకులు తనకు ఓ సినిమా విషయంలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపిక చేస్తామన్నారని, అయితే ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి డొనేషన్ అడిగారని మహేష్ బాబు చెప్పినట్లు….వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కునే స్థితిలో తాను లేనని తాను తిరస్కరించడంతో ఆ అవార్డు మరొక వ్యక్తికి కేటాయించారని మహేష్ బాబు చెప్పినట్లు…… సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన వార్తలోని సారాంశం. అయితే ఈ వార్తలు సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే అన్ని సమయాల్లో ఇలా జరుగుతాయని నేను అనట్లేదు కానీ కొన్ని సమయాల్లో మాత్రం అవార్డులు అమ్ముడుపోతున్నాయని నాకు కలిగిన అనుభవంతో నేను చెప్పగలనని మహేష్ చెప్పడం కొస మెరుపు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top