ట్రాఫిక్ రూల్స్ అతిక్ర‌మించి డ్రైవింగ్ చేస్తే ఇకపై అంతే సంగ‌తులు… భారీ జ‌రిమానా, జైలు శిక్ష ప‌డుతుంది..!


ఇక ర‌హ‌దారిపై ఎలా పడితే అలా వెళ్తామంటే కుద‌ర‌దు. హెల్మెట్ పెట్టుకోనున్నా భారీగా ఫైన్ వేయ‌నున్నారు. ఇక తాగి న‌డ‌ప‌డం, నిర్ల‌క్ష్య‌పు డ్రైవింగ్ వంటి వాటి గురించి అడ‌గ వ‌ద్దు. ఎందుకంటే అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారు ఇక వెనుకా ముందు ఆలోచించుకుని మ‌రీ డ్రైవింగ్ చేయాల్సిందే. లేదంటే భారీ ఎత్తున జ‌రిమానాతోపాటు జైలుశిక్ష‌ను కూడా అనుభ‌వించాల్సి రావ‌చ్చు.

1. హెల్మెట్ లేకుండా ద్విచ‌క్ర వాహ‌నం న‌డిపితే రూ.1వేయి వ‌ర‌కు జ‌రిమానా వేయ‌నున్నారు. కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ పెట్టుకోక‌పోయినా ఇదే విధంగా జ‌రిమానా వేస్తారు. ఒక వేళ రెండో సారి కూడా ఇలాగే ప‌ట్టుబ‌డితే రెట్టింపు జ‌రిమానా, మూడో సారికి అయితే జైలు శిక్ష వేస్తారు.

2. మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపితే రూ.10వేల వ‌ర‌కు జ‌రిమానా ప‌డ‌నుంది. ఈ సంద‌ర్భంలో ఏ వ్య‌క్తికైనా యాక్సిడెంట్ చేస్తే అత‌నికి రూ.5 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం చెల్లించాలి. అదే ఆ వ్య‌క్తి యాక్సిడెంట్‌లో మ‌ర‌ణిస్తే అప్పుడు 5 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష‌, జ‌రిమానా విధిస్తారు.

3. మద్యం సేవించ‌కుండా మామూలుగా వాహ‌నం న‌డుపుతూనే యాక్సిడెంట్ చేస్తే బాధితుల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాలి. ఒక వేళ బాధితుడు మృతి చెందిన ప‌క్షంలో ఆ ప‌రిహారం ఇంకా ఎక్కువ‌గానే ఉండనుంది.

4. చిన్న పిల్ల‌ల‌కు వాహనాల‌ను ఇచ్చి న‌డిపించే పెద్ద‌ల‌కు రూ.25వేల‌కు ఫైన్ వేయ‌నున్నారు.

5. సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ వాహనం న‌డిపితే గ‌రిష్టంగా రూ.5వేల వ‌రకు ఫైన్ వేయ‌నున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top