ఐడియా సంచలన ఆఫర్!!


రిలయన్స్ జియో మార్చి 31తో ఫ్రీ ఆఫర్ గడువు ముగిసినప్పటికీ మళ్లీ మరో మూడు నెలలు దాదాపు ఫ్రీ లాంటి అన్ లిమిటెడ్ ఆఫర్ ఇవ్వడంతో పోటీ టెలికాం సంస్థలన్నీ మళ్లీ ఆందోళన చెందుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి జియో ఎలాగో ఛార్జ్ చేస్తుంది కదా అని ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వడంలో ఆలస్యం చేశాయి. కాని మళ్లీ మూడు నెలలు జియో ఆఫర్ పొడిగించడంతో ఇక ఐడియా, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ ఇలా ఒక్కో సంస్థా ఆఫర్లు ఎనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐడియా గతంలో ఎన్నడూ ఇవ్వని సంచలన ఆఫర్ ప్రకటించింది. 346 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటా చొప్పున 28 రోజులు ఇస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 1జీబీ డేటా లిమిట్ దాటితే స్పీడ్ 80కేబీపీఎస్ కు పడిపోతుంది. ఇక మరోవైపు..

CLICKHERE : జన్మ రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మీకు తెలుసా

గత 6 నెలలుగా రిలయన్స్ జియో ఉచిత సేవలకు మరో 3నెలలు పొడిగింపు వచ్చింది. జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ స్కీమ్ ఆశించిన స్థాయిలో వర్క్‌అవుట్ కాకపోవటంతో రిలయన్స్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ను వినియోగించుకుంటోన్న 10 కోట్ల పై చిలుకు యూజర్లలో కేవలం సగం మంది మాత్రమే జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో అనివార్యంగా మరో మూడు నెలలు ఆఫర్ ను పొడిగించారు. అయితే 303 రూపాయలు రీఛార్జి చేసుకుంటే 3నెలలు ఫ్రీ ఆఫర్ ఇచ్చారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top