కొత్త నోట్లపై కేంద్రం మరో సంచలనం!!

బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ అడ్డుకట్ట ఏమోగాని డబ్బుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని దేశం మొత్తం వణికిపోతోంది. గత ఏడాది నవంబరు 8న ప్రధాని నరేంద్ర మోఢీ ఒక్క కలం పోటుతో రూ.500, రూ.1000 నోట్లను లేకుండా చేసేశారు. ఇప్పుడిప్పుడే ఆ నిర్ణయం తాలూకు గాయాల నుంచి దేశం కోలుకుంటోంది. 

ఇప్పుడు నోట్లపై మరో సంచలన నిర్ణయం తీసుకోనుందట సర్కార్. కొత్త నోట్లపై ఉన్న సెక్యూరిటీ ఫీచర్స్ ను ఈజీగా కాపీ కొడుతున్నారు నకిలీ మాఫియా. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి 3 లేదా 4 ఏళ్లకోసారి కొత్త రూ. 500, రూ. 2000 నోట్ల సెక్యూరిటీ ఫీచర్స్ ను మారుస్తూ ఉండాలని డిసైడ్ అయ్యింది.

అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇదే తరహాలో ప్రతి 3-4 ఏళ్లకోసారి నోట్లపై సెక్యూరిటీ ఫీచర్స్ మారుస్తూ ఉంటాయని తెలిపారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షీ. భారత్‌లోనూ ఈ విధానాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొత్తగా వచ్చిన వాటిల్లో నకిలీ నోట్లు పెద్ద ఎత్తున పట్టుబడటంతో జాగ్రత్తగా స్టడీ చేసిన అధికారులు నివ్వెరపోయాయి. ఆర్ బీఐ ముద్రించే రూ.2వేల నోటు తయారీలో 17 భద్రతాప్రమాణాలు పాటిస్తుండగా నకిలీ నోటును తయారు చేసేవాళ్లు ఇందులో 11 భ‌ద్ర‌తాప్ర‌మాణాల‌ను పాటించ‌డం చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. 


నోటుకు ఎడమవైపు రూ. 2000 అక్షరాలు, ఆర్‌బీఐ గవర్నర్‌ సంతకం తదితరాలను అసలు నోటులో ఉన్నట్లుగానే ముద్రించారు. నకిలీ కరెన్సీని ఐఎస్‌ఐ సాయంతో పాకిస్తాన్‌లో ముద్రిస్తున్నారని, బంగ్లాదేశ్‌ ద్వారా భారత్‌లోకి తీసు కొస్తున్నట్లు కనుగొన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే నోట్లపై భద్రతా ప్రమాణాలు మార్చడమే మంచిదన్న ఏకాభిప్రాయానికి వచ్చారు అధికారులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top