రోజా సెల్వమణి తెలుగు సినిమా నటి. చిత్తూరు జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం రోజా తన కూతురుని సినీ రంగంలోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తుంది.

