అఖిల్ - శ్రియా.. ఇంత చిన్న కారణానికే బ్రేకప్పా?

అఖిల్ అక్కినేనితో శ్రియ భూపాల్ తెగతెంపులు చేసుకోవడానికి కారణమేంటో వాస్తవంగా ఎవరికీ తెలియదు. దీనికి కారణం బ్రేకప్ విషయంపై రెండు కుటుంబాల నుంచీ స్పందన లేదు. వారి బ్రేకప్‌నకు సంబంధించి మరో కొత్త కారణం తెలుస్తోంది. వాస్తవానికి వెంటనే పెళ్లి చేసుకోవాలని శ్రియా భూపాల్ ఇంటి తరపు నుంచే ఒత్తిడి ఎక్కువైందట. అయితే.. నటుడిగా తన కెరీర్ ఏంటో అప్పటికీ సందిగ్ధంలోనే ఉండటంతో అఖిల్ తొలుత పెళ్లికి వెనుకాడడట.

 కెరీర్ కాస్తంత గాడిన పడిన తర్వాత పెళ్లి చేసుకుందామని వారికి చెప్పాడట.
అయినా.. పెళ్లి కూతురు తరపు వారు ఒప్పుకోకపోవడంతో పెళ్లికి సిద్ధమయ్యాడట. ఇదే విషయం మరోసారి వారి మధ్య చర్చకు రావడంతో.. శ్రియా భూపాల్ కుటుంబ సభ్యులు నాగ్ ఫ్యామిలీతో చర్చలు జరిపారట. అయితే.. అఖిల్ రెండో సినిమా విడుదలయ్యాక పెళ్లి చేద్దామని నాగ్ చెప్పినా వారు వినిపించుకోలేదట. అదేవారి మధ్య అభిప్రాయ భేదాలకు కారణమై అఖిల్-శ్రియల పెళ్లి ఆగిపోవడానికి కారణమైందని టాక్. అయితే, ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి వుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top