పవన్ వారసత్వం…రేణూపైన కౌంటర్స్ పడుతున్నాయ్

పవన్ కళ్యాణ్‌తో రేణూ దేశాయ్‌కి ఉన్న సంబంధం ఏంటి అని తలలు బద్ధలు కొట్టుకుంటున్న వాళ్ళు ఎందరో? దానికి కారణం కూడా రేణూనే. ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తూ జనాలను కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. తన పెళ్ళి గురించి, భర్తగా పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన మార్కుల గురించి…ఇంకా బోలెడన్ని విషయాల గురించి రేణూ మాట్లాడిన మాటలన్నీ కూడా చాలా మందిని కన్ఫ్యూజ్ చేశాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటికీ కూడా రేణుదేశాయ్‌ని, పిల్లలను బాగా చూసుకుంటున్నాడని పవన్ సన్నిహితులు చెప్తున్నారు.

ఆ విషయం అలా ఉంటే తాజాగా అఖిరా నందన్‌కి పవన్ వారసత్వం గురించి రేణూ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అఖీరాను హీరోను చేయాలన్న ఇంట్రెస్ట్ పవన్‌కి ఎంతుందో తెలియదు కానీ రేణూకి మాత్రం చాలానే ఉంది. అందుకే తాను సొంతంగా తెరకెక్కించిన సినిమాలో అఖీరా చేత గెస్ట్ రోల్ చేయించింది. అలాగే హీరోకి అవసరమైన స్కిల్స్ విషయంలో అఖీరాకు ట్రైనింగ్ ఇస్తుంది. 


అఖీరా కూడా తెలుగులోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. మరి తెలుగులో ఇంట్రడ్యూస్ అయ్యే ఓ కొత్త హీరోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మించిన వారసత్వం కంటే వరం ఏముంటుంది? పవన్ కంటే కూడా ఇంకా గొప్ప నటుడవ్వాలి, స్టార్ అవ్వాలి అని రేణూ చెప్పి ఉంటే చాలా బాగుండేది కానీ పవన్ వారసుడిగా కాదు…అఖీరా ఇంకేదో కావాలి అని రేణూ దేశాయ్ చెప్పడంపై మాత్రం కౌంటర్స్ పడుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని తీసుకుని……పవర్ స్టార్ లెగసీని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్ళడమే అఖీరాకు ఉన్న బెస్ట్ కెరీర్ ఆప్షన్. ఏమంటారు?
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top