సూపర్‌స్టార్ మహేష్‌బాబు, తమిళ అగ్ర దర్శకుడు మురుగదాస్ కాంబినేషనలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘స్పైడర్’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ టైటిల్ మహేష్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోందట.
దీనికి కారణం టైటిల్ చివర ‘ర్’ అనే అక్షరం. ఇటీవలి కాలంలో ‘లోఫర్’, ‘విన్నర్’, ‘మిస్టర్’ వంటి చివర ‘ర్’ అనే అక్షరంతో వచ్చిన చిత్రాలన్నీ ఘోర పరాజయాలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ‘స్పైడర్’ కూడా పరాజయం బాటలో పయనిస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. అయితే మరికొంత మంది మాత్రం ఇలాంటి సెంటిమెంట్స్‌ను కొట్టిపారేస్తున్నారు. ‘స్పైడర్’ సినిమా రెండు భాషల్లోనూ సూపర్‌హిట్‌గా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


