ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) తమ ఖాతాదారులకు కొత్త విత్ డ్రా నిబంధనలు ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం ప్రాథమిక పొదుపు ఖాతా (Basic Savings Account) కలిగిన వారు నెలకు నాలుగుసార్లు మాత్రమే ఏటీఎంల ద్వారా డ్రా చేయగలిగే వీలుంటుంది. మెట్రో నగరాల్లోని శాఖల్లో పొదుపు ఖాతాలు (Savings Account) ఉన్నవారు నెలకు ఎనిమిదిసార్లు ఏటీఎంల ద్వారా లావాదేవీలు చేయగలరు.
ఇందులో 5 SBI, 3 ఇతర బ్యాంకుల ఏటీఎంలు. మెట్రోయేతర ప్రాంతాల్లోని శాఖల్లో ఖాతాలు ఉన్నవారు పదిసార్లు ఏటీఎంల ద్వారా లావాదేవీలు చేయగలరు. ఇందులో 5 SBI, 5 ఇతర బ్యాంకుల ఏటీఎంలు. పైన తెలిపిన వివరాల ప్రకారం ఉచిత లావాదేవీలు చేసుకునే వెసులుబాటు ఉందని SBI తెలిపింది.
మరోవైపు బ్యాంకుకు చెందిన బడ్డీ యాప్ ను వినియోగించి నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఇందుకు రూ.25 ఛార్జ్ చేయనుంది.
మరోవైపు బ్యాంకుకు చెందిన బడ్డీ యాప్ ను వినియోగించి నగదును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. అయితే ఇందుకు రూ.25 ఛార్జ్ చేయనుంది.


